
సింగపూర్ : కరోనా కరోనా అంటూ అరుస్తూ హోటల్ ఫ్లోర్‌పై ఉమ్మి వేసిన భారత సంతతికి చెందిన సింగపూర్ వ్యక్తికి గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు. జస్వీందర్ సింగ్ మెహర్ సింగ్ (52) మార్చి 3న ఓ హోటల్‌లో దురుసుగా ప్రవర్తిస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించాడు. చాంగి ఎయిర్‌పోర్ట్‌లోని అజర్ రెస్టారెంట్‌కు సింగ్ భోజనం చేసేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది తినుబండారాల విభాగం మూసివేసినట్టు చెప్పడంతో కోపోద్రిక్తుడయ్యాడు. సింగ్ తన చేతిలోని ప్లేటును విసిరికొట్టి దుందుడుకుగా వ్యవహరించాడు. ఆపై ఫ్లోర్‌పై దొర్లుతూ కరోనా కరోనా అంటూ కేకలు వేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం ఈ తరహా నేరం ఇదే మొదటిదని సింగపూర్ పత్రిక పేర్కొంది. కాగా వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై సింగ్ ఈ ఏడాది జనవరిలోనూ జైలు శిక్ష అనుభవించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment