బ్రిటన్‌లో భారతీయుల అరెస్టు | Indians arrested in Britain | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో భారతీయుల అరెస్టు

Published Wed, Aug 23 2017 1:09 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM

Indians arrested in Britain

లండన్‌: అక్రమంగా నివసిస్తున్న వారిపై బ్రిటన్‌ వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో అరెస్టయిన సుమారు 200 మందిలో ఎక్కువ మంది భారతీయులున్నట్లు ఆ దేశ హోం శాఖ వెల్లడించింది. వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తూ పట్టుబడిన వారిలో పాకిస్తాన్, చైనా, అఫ్గానిస్తాన్, ఆల్బేనియా పౌరులు కూడా ఉన్నట్లు తెలిపింది.

జనవరి నుంచి జూన్‌ మధ్య నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పరిమితికి మించి నివాసం ఉంటున్న 253 ఇళ్లపై అధికారులు దృష్టిసారించారు. యూకేలోకి అక్రమంగా ప్రవేశించిన, వీసా గడువు ముగిసినా అక్కడే నివసిస్తున్న మొత్తం 200 మందిని అదుపులోకి తీసుకుని, 24 మంది ఇంటి యజమానులకు జరిమానా విధించారు. అయితే ఈ ఆపరేషన్‌లో దొరికిపోయి, స్వచ్ఛందంగా తిరిగి తమ దేశం వెళ్లిపోతామనుకునే వారికి సాయం చేస్తామని బ్రిటన్‌ హోం శాఖ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement