
లండన్: ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాలప్పనవర్(31) మృతితో ఐర్లాండ్‌లో అబార్షన్ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన రిఫరెండంలో ఆ కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేసినట్లు మీడియా తెలిపింది. 33.6 శాతం మంది వ్యతిరేకించారు. గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రజా తీర్పును ప్రధాని వారద్కర్ స్వాగతించారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిశ్శబ్ద విప్లవం ముగింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఆయన మొదటి నుంచి అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దుకు మద్దతు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment