ట్రంప్‌కు ప్రేమతో..! | Is Donald Trump taking any of Barack Obama's advice? | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ప్రేమతో..!

Published Tue, Sep 5 2017 1:02 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ట్రంప్‌కు ప్రేమతో..! - Sakshi

ట్రంప్‌కు ప్రేమతో..!

అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు లేఖలో సూచనలు చేసిన ఒబామా
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే ముందు డొనాల్డ్‌ ట్రంప్‌కు నాటి అధ్యక్షుడు ఒబామా రాసిన లేఖ ప్రతి ఒకటి తాజాగా వెలుగుచూసింది. శ్వేతసౌధం నుంచి వెళ్లిపోయే అధ్యక్షుడు, కొత్తగా వచ్చే అధ్యక్షుడికి సూచనలు ఇస్తూ లేఖ రాయడం సంప్రదాయం. సాధారణంగా ప్రస్తుత అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోయేవరకు ఆ లేఖను బహిర్గతపరచరు. కానీ ఒబామా రాసిన లేఖను ట్రంప్‌ అధికారం చేపట్టిన ఎనిమిది నెలలకే స్వయంగా ఆయనే శ్వేతసౌధం సందర్శకులకు చూపించగా, వారిలో ఒకరు ఉత్తరాన్ని ఫొటో తీసి మీడియాకు అందించారని సమాచారం. ట్రంప్‌కు ఈ లేఖలో ఒబామా పలు సూచనలు చేశారు.

‘నాతో సహా పార్టీలకతీతంగా లక్షలాది మంది మీపై ఆశలు పెట్టుకున్నారు. ఇది (శ్వేతసౌధం) ఓ అద్వితీయమైన కార్యాలయం. ఇక్కడ విజయం కోసం ముందుగా నిర్ణయించిన మార్గాలేవీ ఉండవు. కాబట్టి నేను ఇచ్చే సలహాలు మీకు పనికొస్తాయో లేదో నాకే తెలీదు’ అని ఒబామా లేఖలో పేర్కొన్నారు. ‘మనిద్దరినీ వేర్వేరు మార్గాల్లో అదృష్టం వరించింది. విజయానికి బాటలు వేయడానికి మనం ఏం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే ప్రపంచానికి అమెరికా నాయకత్వం వహించడం అనివార్యం. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఒబామా లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement