వాషింగ్టన్: అమెరికా వైమానిక దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్(ఐసిల్)కు చెందిన ఇద్దరు కీలక నేతలు హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా పెంటగాన్ ప్రకటించింది. వీరి హతంతో గత కొంతకాలంగా ఈ ఉగ్రవాదుల చేతుల్లో బందీగా ఉన్న మోసుల్ ప్రాంతానికి విముక్తి కలిగే అవకాశం ఏర్పడిందని ఆ ప్రకటనలో పేర్కొంది.
గత నెల 25న మోసుల్ కు సమీపంలో అమెరికా వైమానిక దాడి జరిపిందని, ఇందులో ఐసిల్ కు చెందిన బాసిమ్ మహ్మద్ అహ్మద్ సుల్తాన్, హతీమ్ తాలిబ్ అల్ హందుని హతమయ్యారని పెంటగాన్ అధికారిక కార్యదర్శి పీటర్ కుక్ స్పష్టం చేశారు. చనిపోయినవారిద్దరు కూడా అత్యంత కీలకమైనవారని, దాడులకు వ్యూహాలు రచించడంలో వారిదే కీలక పాత్ర అని ఆయన తెలిపారు.
అమెరికా దాడిలో కీలక ఉగ్ర నేతలు హతం
Published Sat, Jul 2 2016 12:58 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement