సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు
అంకారా : సౌదీ అరేబియా జర్నలిస్ట్ జమాల్ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారనే వాదనలకు బలం చేకూరుతోంది. ఖషోగ్గీ శరీర భాగాలను కొందరు వ్యక్తులు సూట్‌కేసులు, బ్యాగుల్లో తరలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు వ్యక్తులు 5 సూట్ కేసులు, 2 పెద్ద సంచులను ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంట్లోకి తీసుకెళ్తున్నట్లుగా ఉన్న వీడియో ఫుటేజీని ఎ–హబేర్ అనే టర్కీ టీవీ చానల్ ఆదివారం ప్రసారం చేసింది. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సౌదీ కాన్సులేట్‌లోనే 2018 అక్టోబర్‌లో ఖషొగ్గీ(59) హత్యకు గురైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఆ బ్యాగులు, సూట్ కేసుల్లోనే తరలించారని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆ చానల్ పేర్కొంది. అయితే, అప్పట్లో ఖషొగ్గీ శరీర భాగాలను యాసిడ్‌లో వేసి ఆనవాళ్లు దొరక్కుండా చేశారని అనుమానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?)
Suudi Arabistan'ın İstanbul Başkonsolosluğunda katledilen gazeteci Kaşıkçı cinayetine ilişkin özel görüntüler A Haber’e ulaştı. A Haber ekranlarında ilk kez izleyeceğiniz o görüntülerde Kaşıkçı'nın parçalanmış bedeninin olduğu bavulların konsolosluk konutuna taşındığı görülüyor pic.twitter.com/ojqJ4AxyL3
— A Haber (@Ahaber) December 31, 2018
Comments
Please login to add a commentAdd a comment