జాన్ కాంట్లీ
బీరుట్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లు రెండున్నరేళ్లుగా తమ చెరలో ఉన్న బ్రిటిష్ ఫొటో జర్నలిస్టు జాన్ కాంట్లీకి సంబంధించిన మూడో వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఐదున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాంట్లీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను విమర్శించారు.
మిలిటెంట్లపై పోరులో ఆయన వ్యూహం బాగా లేదన్నారు. అలాగే బ్రిటన్ ప్రభుత్వం తనను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంట్లీని 2012 నవంబరులో సిరియాలో కిడ్నాప్ చేశారు.
**