Islamic State militants
-
ఐఎస్ స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడి
పారిస్: ఐఎస్ఎస్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఫ్రాన్స్ సమరం మొదలు పెట్టింది. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా వైమానిక దాడులు ప్రారంభించింది. గత 15 రోజులుగా ఐఎస్ఎస్ ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన ఫ్రాన్స్ దళాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. స్థానిక భాగస్వాములతో కలిసి ఫ్రాన్స్ ఈ ఆపరేషన్ కొనసాగిస్తోంది. అంతకుముందు ఫ్రాన్స్ బలగాలు ఇరాక్ లోని ఐఎస్ఎస్ ఉగ్రవాద తండాలపై దాడులు జరిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. తమ దేశభద్రతకు ముప్పు వాటిల్లిన ప్రతిసారి దాడులు దిగుతున్నామని తెలిపింది. -
ఉగ్ర చెర నుంచి 22 మందికి విముక్తి
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చెర నుంచి 22 మంది క్రైస్తవులు విడుదలయ్యారు. సిరియాలో గత ఫిబ్రవరి 23న కిడ్నాప్‌నకు గురైన వీరిని విడుదల చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఉగ్రవాదుల చెరు నుంచి విడుదలైన వీరు సిరియా ఉత్తరాన ఉన్న హసాఖా పట్టణానికి చేరుకుని, అక్కడ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ పట్టణానికి చెందిన మానవ హక్కుల విభాగం నుంచి ఉగ్రవాదుల ఆగడాలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఉగ్రవాదుల చెరలో ఇంకా మహిళలు, చిన్నారులు సహా 187 మంది బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాల్ హుర్మాజ్, తాల్ షామిరామ్, తాల్ నస్రా పట్టణాలపై ఈ ఏడాది మొదట్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 200 మందికి పైగా ప్రజలను ఐఎస్ ఉగ్రవాదులు బంధించినట్లు సమాచారం. ఈ దాడులు ముఖ్యంగా చర్చ్ వంటి వాటిపై జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. -
3వ వీడియో విడుదల
బీరుట్: ఇరాక్, సిరియాల్లో పేట్రేగుతున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లు రెండున్నరేళ్లుగా తమ చెరలో ఉన్న బ్రిటిష్ ఫొటో జర్నలిస్టు జాన్ కాంట్లీకి సంబంధించిన మూడో వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఐదున్నర నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాంట్లీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను విమర్శించారు. మిలిటెంట్లపై పోరులో ఆయన వ్యూహం బాగా లేదన్నారు. అలాగే బ్రిటన్ ప్రభుత్వం తనను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంట్లీని 2012 నవంబరులో సిరియాలో కిడ్నాప్ చేశారు. ** -
వైమానిక దాడులు: 50 మంది తీవ్రవాదులు మృతి
డెమాస్కస్ : డీర్ అల్ జోర్ తూర్పు ప్రావెన్స్లోని తీవ్రవాదుల శిక్షణ శిబిరంపై శనివారం సిరియా వైమానిక దాడులు జరిపింది. ఆ దాడులలో సున్నీ తీవ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన దాదాపు 50 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అల్ రఖా ప్రాంతంలో కూడా సిరియా దళాలు మరిన్ని వైమానికి దాడులు నిర్వహించాయని తెలిపింది. 2011 మార్చిలో మొదలైన సిరియాలో జరుగుతున్న పోరాటంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మరణించారు. అలాగే ముప్పై లక్షల మంది పొరుగు దేశాలకు వలస పోయారని యూఎన్ తన గణాంకాలలో వెల్లడించింది. -
సిరియాలో 85 సైనికుల హతం
డమాస్కస్: సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఉగ్రవాద దాడులను సైనికులు తిప్పికొట్టలేకపోతున్నారు. ఉగ్రవాదులు రెండు రోజులుగా దాదాపు 85 మంది సైనికులను చంపారు. సిరియా ఉత్తరాది అల్ రక్కా ప్రావిన్స్‌లో హింస తారస్థాయికి చేరింది. ఉగ్రవాదులు బాంబులు, క్షిపణులతో సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నారు. బాంబు దాడుల్లో సైనికులు, అధికారులు మరణించగా, మరో 200 మంది సైనికుల ఆచూకీ లభించడం లేదు. ఇదే ప్రాంతంలో శనివారం హెలీకాప్టర్‌ను కూల్చివేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.