డెమాస్కస్ : డీర్ అల్ జోర్ తూర్పు ప్రావెన్స్లోని తీవ్రవాదుల శిక్షణ శిబిరంపై శనివారం సిరియా వైమానిక దాడులు జరిపింది. ఆ దాడులలో సున్నీ తీవ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్కు చెందిన దాదాపు 50 మంది తీవ్రవాదులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.
అల్ రఖా ప్రాంతంలో కూడా సిరియా దళాలు మరిన్ని వైమానికి దాడులు నిర్వహించాయని తెలిపింది. 2011 మార్చిలో మొదలైన సిరియాలో జరుగుతున్న పోరాటంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది మరణించారు. అలాగే ముప్పై లక్షల మంది పొరుగు దేశాలకు వలస పోయారని యూఎన్ తన గణాంకాలలో వెల్లడించింది.