పిట్టకొంచెం కూత ఘనం!  | Little kid Gretan Burgh to the environmental conservation | Sakshi
Sakshi News home page

పిట్టకొంచెం కూత ఘనం! 

Published Sun, Dec 9 2018 2:38 AM | Last Updated on Sun, Dec 9 2018 2:38 AM

Little kid Gretan Burgh to the environmental conservation - Sakshi

పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేని స్వీడన్‌కి చెందిన ఓ చిన్నారి ప్రస్తుతం పర్యావరణాన్ని కాపాడేందుకు నడుంబిగించి ప్రపంచనేతలే తలదించుకునేలా చేసింది. పర్యావరణ మార్పులను అంగీకరించని రాజకీయనాయకుల వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రసంగాలతో ఆకట్టుకుంటోంది. మీరు ఔనన్నా కాదన్నా యువతరం భవిష్యత్తుని పర్యావరణ కాలుష్యం కబళిస్తోందనీ, కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాలను అరికట్టాలనీ ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు గత పాతికేళ్ళుగా బతిమాలుతోంది. అయితే తను మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం నేతలను బతిమిలాడబోననీ యునైటెడ్‌ నేషన్స్‌ క్లయిమేట్‌ చేంజ్‌ సమ్మిట్‌  ఛిౌp24 ని ఉద్దేశించి పదిహేనేళ్ళ గ్రేటా థన్‌బెర్గ్‌ తేల్చి చెప్పింది. భావితరాల భవిష్యత్తుని అంధకారంగా మారుస్తోన్న కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణ బాధ్యతని భుజాలకెత్తుకోవాల్సిన పెద్దతరం చేష్టలుడిగిందనీ, అందుకే ఈతరం ఆ బాధ్యతను తలకెత్తుకుం దనీ పోలండ్‌లో జరుగుతోన్న ప్రపంచ పర్యావరణ సదస్సుని ఉద్దేశించి ప్రసంగించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

ప్రపంచ సదస్సు వేదికను పంచుకోకముందే గత ఆగస్టునుంచి ఈ చిన్నారి పర్యావరణ పరిరక్షణ కోసం నిరసనోద్యమాన్ని చేపట్టింది. ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన మార్పులు, వాతావరణంలో సమతుల్యతలోపించడం, గ్లోబల్‌ వార్మింగ్‌ అంతిమంగా భవిష్యత్‌ తరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోందన్న వాదనను ట్రంప్‌లాంటి వారు అవహేళన చేస్తుండడాన్ని నిరసిస్తూ పర్యావరణ బాధ్యతను పాలకులు గుర్తించాలంటూ పాఠశాల ముందు సమ్మెకు దిగింది. నేతలు ఓట్ల కోసమైనా పర్యావరణ సమస్యను గుర్తించక తప్పదనీ, అంతవరకూ తన పోరాటాన్ని ఆపేదిలేదంటోన్న ఆ చిన్నారి పట్టుదలకు అంతా నివ్వెరపోతున్నారు. ‘‘మా భవిష్యత్తుని ఛిద్రం చేస్తోన్నందుకే నేనీ ఉద్యమాన్ని చేపట్టాను’’అనే నినాదాలను కరపత్రాల రూపంలో స్వీడన్‌ పార్లమెంటు ఎదుట పంచుతోంది.

ఇదే అంశమై ప్రపంచబ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రముఖ పర్యావరణ వేత్తలతో నిర్వహించిన చర్చాకార్యక్రమాల్లో పాల్గొని శెభాష్‌ అనిపించుకుంటోంది గ్రేటా. పర్యావరణ పోరాటాన్ని అందిపుచ్చుకున్న ఆస్ట్రేలియా, బ్రిటన్,అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 270 పట్టణాలూ, ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది విద్యార్థులూ యిప్పుడు గ్రేటా థన్‌బర్గ్‌ ఉద్యమంలో భాగ స్వాములయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉపన్యాసాలకే పరిమితం కాకుండా గ్రేటాథన్‌ బర్గ్‌ ఆచరణలో కూడా ముం దుంది. సోలార్‌ బ్యాటరీస్‌ని ఉపయోగించడం, విమాన ప్రయాణాలు చేయకపోవడం, తన కూరగాయలను తనే పండించుకోవడం లాంటి కార్యక్రమాలతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement