
వాషింగ్టన్: గురుగ్రహం చంద్రుల్లో ఒకటైన యూరోపా మీద జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్రెజిల్‌లోని సావో పాలో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యూరోపాపై సూక్ష్మజీవుల ఆవాస యోగ్యమైన పరిస్థితులపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా యూరోపా వాతావరణ పరిస్థితులను పోలిన దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ దగ్గర ఉన్న మానెంగ్ బంగారు గనుల్లో పరిశోధన చేశారు.
సుమారు 2.8 కి.మీ లోతుల్లో సూర్యరశ్మీ అవసరం లేకుండానే బ్యాక్టీరియం కాండిడాటస్ డిసల్‌ఫోర్డిస్ అడక్స్‌వేటర్ అనే బ్యాక్టీరియా మనుగడ సాధిస్తున్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా యూరోపా భూగర్భంలో దాదాపు 10 కి.మీ లోతులో ఉన్న సముద్రంలోని సూక్ష్మజీవులను పోలి ఉన్నట్లు గుర్తించారు. గనుల్లో లీకవుతున్న నీటి బిందువుల్లో రేడియో ధార్మికత కలిగిన యూరేనియం ఉందని, ఇదీ నీటి అణువులను విడగొట్టి ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుందని వర్సిటీకి చెందిన గలంటే అనే పరిశోధకుడు తెలిపారు. దీని వల్లే బ్యాక్టీరియా జీవిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment