థేమ్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు | London City Airport closed after WWII bomb discovered | Sakshi
Sakshi News home page

థేమ్స్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

Published Tue, Feb 13 2018 2:23 AM | Last Updated on Tue, Feb 13 2018 2:25 AM

London City Airport closed after WWII bomb discovered - Sakshi

లండన్‌: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు తాజాగా లండన్‌ దగ్గర్లోని థేమ్స్‌ నదిలో బయటపడింది. ఈ ప్రాంతం లండన్‌ సిటీ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో సోమవారం అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన అన్ని విమానాలనూ రద్దు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఈ బాంబు బయటపడటంతో అప్పుడే విమానాశ్రయాన్ని పోలీసులు మూసివేశారు. దీంతో 16 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. చుట్టు పక్కల ఇళ్లలోని వారిని కూడా ఖాళీ చేయించిన అధికారులు.. పోలీసులతో కలసి బాంబును తీసివేసే పనిలో నిమగ్నమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement