World War II bomb
-
రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు వెలికితీత
లండన్: రెండో ప్రపంచయుద్దంకాలంలో బ్రిటన్‌పై శత్రుదేశం జారవిడిచిన 500 కేజీల బరువైన పేలని బాంబును అధికారులు తాజాగా కనుగొన్నారు. ఇప్పటికీ అది పేలే సామర్థ్యం కల్గిఉండటం విశేషం. దీంతో హుటాహుటిన ఏకంగా 10,000కుపైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధంకాకుండా శాంతికాలంలో బ్రిటన్‌లో ఇలా పౌరులను తరలించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. నైరుతి బ్రిటన్‌లోని ప్లైమౌత్ తీరపట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఒక ఇంటి పెరట్లో నేలలో మంగళవారం ఈ భారీ బాంబును కనుగొన్నారు. అందర్నీ వేరే చోటుకు తరలించాక దీనినీ దగ్గర్లోని సముద్రజలాల్లోకి తీసుకెళ్లి పేల్చేశామని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. -
ఫేస్బుక్ యూజర్లు గుర్తుపట్టకపోయుంటేనా..
లండన్: కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అంటే ఇదేనేమో... తనకు దొరికింది బాంబు అని తెలీక దానితోనే ఆటలాడాలనుకుందో మహిళ. సమయానికి ఫేస్బుక్ యూజర్లు నిజం చెప్పారు కాబట్టి బతికిపోయింది. లేకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇంగ్లండ్‌లోని వేమౌత్‌కు చెందిన లూలూ సిరిల్లో అనే మహిళ తన గార్డెన్లో పనులు చేస్తుండగా బురదలో కూరుకుపోయి ఉన్న ఓ వస్తువును గుర్తించింది. పది ఇంచుల పొడవున్న దాన్ని రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుగా గుర్తించలేకపోయింది. అదేదో ఆట వస్తువు అనుకున్న ఆమె.. దాన్ని కిచెన్‌లోకి తీసుకెళ్లి తీరికగా శుభ్రం చేసి పెట్టింది. అనంతరం దాన్ని పెంపుడు జంతువు ఆడుకునేందుకు ఇచ్చింది. (మోదీ ఫస్ట్... ట్రంప్ సెకండ్) చెప్పుకోండి చూద్దాం.. అయితే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామని భావించిన మహిళ దాని ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇదేంటో చెప్పండి చూద్దాం అని ప్రశ్న విసిరింది. ఆ ఫొటోను చూసి ఒకింత ఆశ్చర్యానికి మరింత కంగారుకు లోనైన నెటిజన్లు అది బాంబు అని తెలిపారు. దీంతో చంకలో బాంబు పెట్టుకుని విన్యాసాలు చేస్తున్నానా అని భావించిన మహిళ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. ఆమె ఇంటికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ అధికారులు దాన్ని రెండో ప్రపంచ యుద్ధం లో తయారు చేసిన బాంబుగా గుర్తంచారు. పేలుడు పదార్థాలు లోడ్ చేసి ఉన్న దాన్ని ఇంకా వినియోగించలేదని ఆమెకు తెలిపారు. అనంతరం ఆ బాంబును అక్కడి నుంచి తీసుకెళ్లారు. శనివారం నాడు సముద్రంలో దాన్ని నిర్వీర్యం చేశారు. (ఫేస్బుక్లో కొత్తగా వచ్చిన కేర్ ఎమోజీ!) -
తవ్వకాల్లో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు
కోల్‌కతా : రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి భారీ బాంబు బయటపడటం పశ్చిమ బెంగాల్లో కలకలం సృష్టించింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ రేవు బెర్త్-2 వద్ద తవ్వకాలు నిర్వహిస్తుండగా బాంబు బయటపడింది. అధికారులు తొలుత దానిని టార్పెడోగా భావించారు. అయితే, నౌకాదళం ఏరియల్ బాంబుగా నిర్ధారించింది. ప్రస్తుతం బాంబు లాక్ అయి ఉందని, దానివల్ల ముప్పేమీ లేదని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు 4.5 మీటర్ల పొడవు, 453 కిలోల బరువు కలిగి ఉంది. యుద్ధ విమానాలకు తగిలించేందుకు వీలుగా దాన్ని రూపొందించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అధికారుల సహాయంతో బాంబును నిర్వీర్యం చేస్తామని, అవసరమైతే విశాఖపట్నం నౌకాస్థావరం అధికారుల సహాయం తీసుకుంటామని నౌకదళం ఇంచార్జ్ కమోడోర్ సుప్రోభో కె దే తెలిపారు. -
థేమ్స్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
లండన్: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు తాజాగా లండన్ దగ్గర్లోని థేమ్స్ నదిలో బయటపడింది. ఈ ప్రాంతం లండన్ సిటీ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో సోమవారం అక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన అన్ని విమానాలనూ రద్దు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఈ బాంబు బయటపడటంతో అప్పుడే విమానాశ్రయాన్ని పోలీసులు మూసివేశారు. దీంతో 16 వేల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. చుట్టు పక్కల ఇళ్లలోని వారిని కూడా ఖాళీ చేయించిన అధికారులు.. పోలీసులతో కలసి బాంబును తీసివేసే పనిలో నిమగ్నమయ్యారు. -
‘రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం’
న్యూఢిల్లీ: నిత్యం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే డీఆర్డీవో భవన్ నుంచి అత్యంత శక్తివంతమైన ఒక బాంబును గతంలో తమ సిబ్బంది స్వాధీనం చేసుకొని డిస్పోజ్ చేశారని జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) చీఫ్ ఆర్.సి.తయాల్ తెలిపారు. దీనిని డిస్పోజ్ చేయడం వేరే ఏ ఏజెన్సీకి సాధ్యం కాకపోవడంతో తమ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అనంతరం ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా తేలిందని చెప్పారు. ఏప్రిల్ 14న భవనం కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న సమయంలో అది లభ్యమైంది.