లండన్: కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అంటే ఇదేనేమో... తనకు దొరికింది బాంబు అని తెలీక దానితోనే ఆటలాడాలనుకుందో మహిళ. సమయానికి ఫేస్‌బుక్ యూజర్లు నిజం చెప్పారు కాబట్టి బతికిపోయింది. లేకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇంగ్లండ్‌లోని వేమౌత్‌కు చెందిన లూలూ సిరిల్లో అనే మహిళ తన గార్డెన్‌లో పనులు చేస్తుండగా బురదలో కూరుకుపోయి ఉన్న ఓ వస్తువును గుర్తించింది. పది ఇంచుల పొడవున్న దాన్ని రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుగా గుర్తించలేకపోయింది. అదేదో ఆట వస్తువు అనుకున్న ఆమె.. దాన్ని కిచెన్‌లోకి తీసుకెళ్లి తీరికగా శుభ్రం చేసి పెట్టింది. అనంతరం దాన్ని పెంపుడు జంతువు ఆడుకునేందుకు ఇచ్చింది. (మోదీ ఫస్ట్... ట్రంప్ సెకండ్)
చెప్పుకోండి చూద్దాం..
అయితే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందామని భావించిన మహిళ దాని ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇదేంటో చెప్పండి చూద్దాం అని ప్రశ్న విసిరింది. ఆ ఫొటోను చూసి ఒకింత ఆశ్చర్యానికి మరింత కంగారుకు లోనైన నెటిజన్లు అది బాంబు అని తెలిపారు. దీంతో చంకలో బాంబు పెట్టుకుని విన్యాసాలు చేస్తున్నానా అని భావించిన మహిళ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. ఆమె ఇంటికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ అధికారులు దాన్ని రెండో ప్రపంచ యుద్ధం లో తయారు చేసిన బాంబుగా గుర్తంచారు. పేలుడు పదార్థాలు లోడ్ చేసి ఉన్న దాన్ని ఇంకా వినియోగించలేదని ఆమెకు తెలిపారు. అనంతరం ఆ బాంబును అక్కడి నుంచి తీసుకెళ్లారు. శనివారం నాడు సముద్రంలో దాన్ని నిర్వీర్యం చేశారు. (ఫేస్‌బుక్‌లో కొత్తగా వచ్చిన కేర్ ఎమోజీ!)
Comments
Please login to add a commentAdd a comment