లండన్: రెండో ప్రపంచయుద్దంకాలంలో బ్రిటన్‌పై శత్రుదేశం జారవిడిచిన 500 కేజీల బరువైన పేలని బాంబును అధికారులు తాజాగా కనుగొన్నారు. ఇప్పటికీ అది పేలే సామర్థ్యం కల్గిఉండటం విశేషం. దీంతో హుటాహుటిన ఏకంగా 10,000కుపైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
యుద్ధంకాకుండా శాంతికాలంలో బ్రిటన్‌లో ఇలా పౌరులను తరలించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. నైరుతి బ్రిటన్‌లోని ప్లైమౌత్ తీరపట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఒక ఇంటి పెరట్లో నేలలో మంగళవారం ఈ భారీ బాంబును కనుగొన్నారు. అందర్నీ వేరే చోటుకు తరలించాక దీనినీ దగ్గర్లోని సముద్రజలాల్లోకి తీసుకెళ్లి పేల్చేశామని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment