తవ్వకాల్లో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు | Second World War Bomb Found During Dredging Operations In Kolkata | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 30 2018 11:36 AM | Last Updated on Sun, Dec 30 2018 11:41 AM

Second World War Bomb Found During Dredging Operations In Kolkata - Sakshi

కోల్‌కతా : రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి భారీ బాంబు బయటపడటం పశ్చిమ బెంగాల్‌లో కలకలం సృష్టించింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ రేవు బెర్త్‌-2 వద్ద తవ్వకాలు నిర్వహిస్తుండగా బాంబు బయటపడింది. అధికారులు తొలుత దానిని టార్పెడోగా భావించారు. అయితే, నౌకాదళం ఏరియల్‌ బాంబుగా నిర్ధారించింది.

ప్రస్తుతం బాంబు లాక్‌ అయి ఉందని, దానివల్ల ముప్పేమీ లేదని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు 4.5 మీటర్ల పొడవు, 453 కిలోల బరువు కలిగి ఉంది. యుద్ధ విమానాలకు తగిలించేందుకు వీలుగా దాన్ని రూపొందించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అధికారుల సహాయంతో బాంబును నిర్వీర్యం చేస్తామని, అవసరమైతే విశాఖపట్నం నౌకాస్థావరం అధికారుల సహాయం తీసుకుంటామని నౌకదళం ఇంచార్జ్‌ కమోడోర్ సుప్రోభో కె దే తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement