టాయిలెట్‌లో కస్టమ్స్ అధికారిణి మృతదేహం
బీజింగ్: మకావు కస్టమ్స్ అధికారి ఒకరు పబ్లిక్ టాయిలెట్‌లో శవమై కనిపించారు. చైనా రాజధాని బీజింగ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం... కస్టమ్స్ సేవల డైరెక్టర్ లాయ్ మిన్హువా బీజింగ్ లోని ఓసియన్ గార్డెన్ ప్రాంతానికి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. అయితే, ఈ క్రమంలో ఆమె గార్డెన్లో ఉన్న టాయిలెట్‌లో శవమై కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మిన్హువాది హత్యా.. లేక ఆత్మహత్యా అన్న వివరాలు తేలాల్సి ఉందని మకావో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుయ్ షియాన్ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపించడం లేదని స్థానిక అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం భద్రత అంశంపై ఓ సమావేశానికి హాజరవ్వాల్సి ఉండగా ఆమె అనుమానస్పద స్థితిలో మృతిచెందారని షియాన్ వివరించారు.