వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం లేదు.
క్రైస్ట్ చర్చ్కు తూర్పున 15 కిలో మీటర్ల దూరంలో 8 కిలో మీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా సునామీ వచ్చే అవకాశముందని న్యూజిలాండ్ వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. 2011లో క్రైస్ట్ చర్చ్ను భారీ భూకంపం కుదిపేసింది. అప్పట్లో 185 మంది మరణించగా, అపార ఆస్తి నష్టం జరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మళ్లీ భూమి కంపించింది.
న్యూజిలాండ్లో భూకంపం
Published Sun, Feb 14 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement
Advertisement