Christchurch
-
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
NZ Vs SA : 7 వికెట్లతో చెలరేగిన కివీస్ బౌలర్.. 95 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
South Africa Tour Of New Zealand 2022- 1st Test Day 1: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు పడగొట్టి ప్రొటిస్ జట్టును కోలుకోకుండా చేశాడు. దీంతో 95 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య కివీస్‌కు హెన్రీ శుభారంభం అందించాడు. తొలుత ప్రొటిస్ కెప్టెన్, ఓపెనర్ డీన్ ఎల్గర్(1 పరుగు)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్కరమ్(15), డసెన్(8) వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. హంజా(25), వెరెనె(18), రబడ(0), స్టర్మాన్(0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఓవర్లు వేసిన హెన్రీ... 23 పరుగులు ఇచ్చి మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పేసర్ హెన్రీకి తోడు జెమీషన్, టిమ్ సౌథీ, వాగ్నర్ తలా ఓ వికెట్ తీయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌కు ఓపెనర్ టామ్ లాథమ్(15), విల్ యంగ్(8) శుభారంభం అందించలేకపోయారు. కాన్వే(36), హెన్రీ నికోల్స్(37- బ్యాటింగ్) రాణించారు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 116 పరుగులు చేసింది. 21 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నికోల్స్, వాగ్నర్ క్రీజులో ఉన్నారు. చదవండి: Ind Vs WI 1st T20: 'అది వైడ్‌బాల్ ఏంటి' రోహిత్ అసహనం.. కోహ్లి సలహా 5 WICKETS FOR HENRY 🔥#SparkSport #NZvSA@BLACKCAPS pic.twitter.com/EM9CAuuABS — Spark Sport (@sparknzsport) February 17, 2022 What a day for @Matthenry014! 7-23. His first FIVE wicket haul in Test cricket and the equal third best Test innings figures for New Zealand. South Africa all out for 95 batting first at Hagley. Follow play LIVE with @sparknzsport. #NZvSA pic.twitter.com/ZQIsEcKuBq — BLACKCAPS (@BLACKCAPS) February 17, 2022 -
‘దొంగ’ పిల్లి.. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు..
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్ దంపతులు పెంచుకుంటున్న ఐదేళ్ల నల్లపిల్లి ఇది. పేరు.. కీత్. దీని ‘దొంగ’బుద్ధితో ఇరుగుపొరుగు వారికి భలే చిక్కొచ్చిపడింది. అర్ధరాత్రులు నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం... కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటు. బూట్లు, స్విమ్ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, ఓ పోలీసు అధికారి షర్టు, ఈల్ చేపలు... ఇలా చాలానే యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది. మూడేళ్లుగా దీనికి ఈ అలవాటున్నా... ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది. ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరం, తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోళ్లు. ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక... ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్ బుట్ట పెట్టి... కీత్ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి... బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ. -
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు
క్రైస్ట్‌చర్చి: పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కివీస్ 176 పరుగులు ఇన్నింగ్స్ తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరవడమేగాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') కివీస్ సహచర ఆటగాడు బీజే వాట్లింగ్ విలియమ్సన్ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దీంతో అనుకోని సంఘటనతో మొదట విలియమ్సన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే వెంటనే చిరునవ్వు అందుకుంటూ వాట్లింగ్ తెచ్చిన షర్ట్‌పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ బ్లాక్ క్యాప్స్ తన ట్విటర్లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్ అడుగుతాడని విలియమ్సన్ బహుశా ఊహించి ఉండంటూ' క్యాప్షన్ జత చేసింది. కాగా రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ (157; 18 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది. విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజహర్ అలీ(37), జాఫర్ గౌహర్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.(చదవండి: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) "What is going on?" 🤔 Not much, just BJ Watling fanboying Kane Williamson in the middle of a press conference 😄pic.twitter.com/aLJ2ypQUef — ICC (@ICC) January 6, 2021 -
'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం'
క్రైస్ట్‌చర్చి : పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీపై తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో పాక్ ఆటతీరును విమర్శిస్తూ పీసీబీని ఎండగట్టాడు. పాక్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్విటర్లో ఒక వీడియోనూ షేర్ చేశాడు. 'పాకిస్తాన్ ఆటతీరు స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉంది. పీసీబీ విధానాలు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. యావరేజ్‌గా ఆడే ఆటగాళ్లను టెస్టు జట్టుకు ఎంపిక చేయడం పీసీబీకే చెల్లింది. యావరేజ్ జట్టుగా ఉంది కాబట్టే ఫలితాలు కూడా యావరేజ్‌గానే వస్తాయి.. అయినా పాక్ జట్టు ఎప్పుడు టెస్టు మ్యాచ్ ఆడినా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తుంది.వీరికన్నా క్లబ్ క్రికెట్ ఆడేవాళ్లు నయం. నిజానికి పాక్ ఆటతీరు స్కూల్ లెవెల్ క్రికెట్‌కు పడిపోవడానికి పీసీబీయే పరోక్షంగా కారణం.అయితే పీసీబీ ఇప్పుడు మేనేజ్మెంట్ను మార్చాలని చూస్తుంది. ఇది జరిగితే మంచిదే.. కానీ ఎప్పుడు మేనేజ్మెంట్ను మారుస్తుందనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయిందంటూ 'అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. (చదవండి: పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే) కాగా రెండో టెస్టులో కివీస్ బౌలర్ ఖైల్ జేమిసన్ దాటికి పాక్ జట్టు 297 పరుగులకే ఆలౌట్ అయింది. రిజ్వాన్ 61 పరుగులతో రాణించడం మినహా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ భారీ స్కోరు నమోదు చేసింది. కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విలియమ్సన్కు తోడుగా హెన్రీ నికోలస్ 157 పరుగులు, డారెల్ మిచెల్ 102 పరుగులతో విజృంభించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్ ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసి మూడోరోజు ఆటను ముగించింది. పాక్ ఆటతీరు చూస్తుంటే ఇన్నింగ్స్ పరాజయం దిశగా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది.(చదవండి: 'ఆ మ్యాచ్ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం') Clubs teams would play better than this. pic.twitter.com/r9m4ekqbeq — Shoaib Akhtar (@shoaib100mph) January 5, 2021 -
నాన్న క్రికెట్ ఆడమంటేనే తిరిగి వచ్చా: స్టోక్స్
లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన తండ్రి చెప్పినందుకే ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వచ్చానన్నాడు. ఓ కొడుకులా తన బాధ్యతలు నెరవేరుస్తున్నట్లే క్రికెట్ బాధ్యతల్ని విస్మరించకూడదని తన తండ్రి తెలిపాడని స్టోక్స్ వివరించాడు. క్రైస్ట్‌చర్చ్‌లో ఉన్న కుటుంబసభ్యుల్ని వీడి వచ్చేందుకు మనసు రాలేదని... అయితే తండ్రి ఇచ్చిన ధైర్యం, కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే ఐపీఎల్ ఆడేందుకు వచ్చానని స్టోక్స్ పేర్కొన్నాడు. అతని తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్ అని తెలియడంతో పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే ఈ ఆల్‌రౌండర్ న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. కొంతకాలం ఆటకు విరామమిచ్చి తల్లిదండ్రులను చూసుకున్నాడు. పరిస్థితులు కాస్త మెరుగవడంతో ఆడేందుకు వచ్చిన స్టోక్స్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. ‘కివీస్ నుంచి రాగానే హోటల్ గదికే పరిమితం కావడం మొదట్లో కాస్త ఇబ్బందికరమైనా... ఇక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు చూస్తుంటే సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది’ అని అన్నాడు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం అతను ఈ నెల 10 దాకా బరిలోకి దిగే అవకాశం లేదని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. -
ఆకట్టుకున్న పుజారా; జట్టు స్కోరెంతంటే..
క్రైస్ట్‌చర్చి : హెగ్లే ఓవల్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. పుజార, హనుమ విహారిలు అర్థశతకాలు చేయడంతో టీ విరామం సమయానికి భారత్ 53.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చటేశ్వర్ పుజారా 53 పరుగులుతో ఆడుతున్నాడు. అయితే హనుమ విహారి 55 పరుగులు చేసి ఔట్ కావడంతో బారత్ 5వ వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు టాస్ గెలిచిన కివీస్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాలు ఆరంభంలో ఆచుతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. జట్టు స్కోరు 30 పరుగులు ఉన్నప్పుడు మయాంక్ 7 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారతో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా వన్డే తరహాలో ఇన్నింగ్స్ ఆడి 8పోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 80 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లితో కలిసి పుజార మరో వికెట్ పడకుండా 85 పరుగుల వద్ద లంచ్‌కు వెళ్లింది. లంచ్ విరామమనంతరం విరాట్ కోహ్లి తన పేలవ ఫామ్‌ను మరోసారి కొనసాగిస్తూ సౌథీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే 7 పరుగులు చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, బౌల్ట్, జేమిసన్ తలా ఒక వికెట్ తీశారు. కాగా గాయంతో రెండో టెస్టుకు దూరమైన ఇషాంత్ స్థానంలో ఉమేశ్ యాదవ్ ,రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జడేజా టీమిండియా తుది జట్టులోకి రాగా, కివీస్ ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగింది. -
ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియా కొత్త రికార్డు
క్రైస్ట్‌చర్చి : ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే టీమిండియాపై 3-0 తేడాతో వన్డే సిరీస్, 10 వికెట్ల తేడాతో తొలి టెస్టును కైవసం చేసుకొన్న కివీస్ రెండో టెస్టులోనూ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు టెస్టు చాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి తర్వాత కనీసం రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తుంది. అయితే రెండో టెస్టు జరగనున్న క్రైస్ట్‌చర్చి నగరంలోనే రెండు మైదానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏఎంఐ స్టేడియం కాగా మరొకటి హెగ్లే ఓవల్ స్టేడియం ఉన్నాయి. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) టీమిండియా ఇప్పటివరకు ఏఎంఐ స్టేడియంలో నాలుగు టెస్టులు ఆడగా రెండు ఓటమిపాలై రెండు డ్రాగా ముగించింది. కాగా హెగ్లే ఓవల్ మైదానంలో మాత్రం ఇంతవరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శనివారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు తొలి మ్యాచ్ కానుంది. ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే క్రైస్ట్‌చర్చిలో తొలి విజయంతో పాటు టీమిండియా పేరిట కొత్త రికార్డు నమోదవుతుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇక్కడ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు గెలుచుకొని, ఒక మ్యాచ్‌లో ఓటమి చెంది మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. (టెస్టు ఓటమి.. కపిల్ ప్రశ్నల వర్షం) (‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’) -
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!
టెక్సాస్ : ఎల్ పాసోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో శనివారం ఓ ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించిన పాట్రిక్ క్రూజియాజ్ (21) విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 20 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వర్ణ వివక్ష కారణంగానే నిందితుడు ఈ మారణహోమానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు 19 నిముషాల క్రితం నిందితుడు విడుదల చేసిన వీడియోలో విస్తుగొలిపే విషయాలు వెల్లడైనట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. దాని ప్రకారం.. వర్ణం ఆధారంగా అమెరికాను విభజించాలని.. తెల్లవారి స్థానంలో బయటి వ్యక్తులు అవకాశాలు తన్నుకుపోతున్నారని ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేశాడు. (చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం.. 20 మంది మృతి) 51 మంది ప్రాణాలు బలిగొన్న న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ ఉన్మాదిని క్రూజియాజ్ ప్రశంసించాడు. అతని స్పూర్తిగానే కాల్పులకు తెగబడుటున్నట్టు చెప్పాడు. వర్ణ సంకరణం అమెరికా జన్యు విధానాన్ని నాశనం చేస్తోందని ‘ది ఇన్‌కన్వినెంట్ ట్రూత్’ పేరుతో అతను విడుదల చేసిన వర్ణ వివక్ష మేనిఫెస్టోపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్లాక్ డ్రెస్‌లో ఉన్నట్టు సీసీ కెమెరాల ఆధారంగా బయటపడింది. 2017లో టెక్సాస్‌లోని చర్చిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఇదే పెద్దది. ఇదిలా ఉండగా.. ఓహియోలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ఘారత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.16 మంది గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. -
ఫేస్బుక్ లైవ్‌పై ఆంక్షలు
పారిస్: తమ లైవ్ స్ట్రీమింగ్ వీడియోలపై పలు ఆంక్షలు విధించనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. తీవ్రవాదం, విద్వేషాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. ‘క్రైస్ట్‌చర్చ్’మసీదు కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో తీవ్రవాదం పెచ్చుమీరకుండా ఉండేందుకు ఆ సంస్థలపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు ప్రపంచవ్యాప్తంగా ‘క్రైస్ట్‌చర్చ్’పిలుపునివ్వాలని సిద్ధమవుతున్నారు. మార్చిలో శ్వేత జాతీయుడు క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదులో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 51 మంది చనిపోయారు. కాల్పులు జరుపుతూ దుండగుడు ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేశాడు. అప్పటినుంచి చర్యలు తీసుకోవాల్సిందిగా జుకర్ బర్గ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఫేస్బుక్ వినియోగదారులు తీవ్రవాద సంబంద వీడియోల లైవ్‌పై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ‘న్యూజిలాండ్‌లో జరిగిన మారణహోమం తర్వాత తీవ్రవాదం వ్యాప్తిచేసేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపాం’అని ఫేస్బుక్ తెలిపింది. -
అందుకు ప్రతీకారంగానే శ్రీలంకలో బాంబుదాడులు!
కొలంబో: శ్రీలంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం నాడు భీకరమైన బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఎల్టీటీఈ తిరుగుబాటు అణచివేత అనంతరం ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో ఒక్కసారిగా ఈ ఉగ్రవాద బాంబుదాడులు ఎందుకు జరిగాయి? స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఎందుకు ఇంత తీవ్రమైన ఆత్మాహుతి, బాంబు దాడులకు తెగబడింది? అన్నది ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ.. శ్రీలంక సీనియర్ మంత్రి ఒకరు మంగళవారం దేశ పార్లమెంటులో కీలక విషయాలు వెల్లడించారు. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. శ్రీలంకలో గత ఆదివారం జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడుల్లో 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. -
న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ సిటీలో ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో ఇకపై దాడిలో వాడే తుపాకులపై ఆ దేశం గురువారం తక్షణ నిషేధం విధించింది. తుపాకులు, సైన్యం వాడే గన్ల మాదిరి ఉండే సెమీ–ఆటోమేటిక్ తుపాకులను అన్నింటినీ తక్షణం నిషేధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై ఓ శ్వేతజాతీయుడు గత శుక్రవారం కాల్పులు జరిపి 50 మంది చంపేయడం తెల్సిందే. ‘శుక్రవారం నాటి దాడి కోసం ఉగ్రవాది వాడిన రకం తుపాకులపై నిషేధం విధిస్తున్నాం. వాటిని కొనాలనుకుంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. గతంలో కొన్నవాటికి వెనక్కిఇస్తే డబ్బు చెల్లిస్తాం’ అని ప్రధాని చెప్పారు. ఇక అమెరికాలో తుపాకులపై నిషేధం విధించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉండటం తెలిసిందే. న్యూజిలాండ్ నిర్ణయంతో తాజాగా అమెరికాలో ఆ డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. పలువురు అమెరికా రాజకీయ నేతలు సహా తుపాకుల విచ్చలవిడి వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా అమెరికా కూడా తుపాకులపై నిషేధం విధించాలని కోరుతున్నారు. బతికున్న వ్యక్తిని చనిపోయాడన్నారు.. బతికున్న ఓ వ్యక్తి పేరును క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారి జాబితాలో పోలీసులు పొరపాటున చేర్చారు. కాల్పులు జరిపిన బ్రెంటన్ టారంట్‌పై పోలీసులు తయారుచేసిన అభియోగప త్రంలో బతికున్న ఓ వ్యక్తి పేరును చేర్చి పోలీసులు దానిని కోర్టుకు సమర్పించారు. ఆ వ్యక్తితో మాట్లాడి క్షమాపణ కోరామనీ, అభియోగపత్రంలో అతని పేరును తొలగించామని పోలీసులు చెప్పారు. -
‘పుల్వామా అమరులు ఇప్పుడు సంతోషిస్తారు’
దుబాయ్ : న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో గత శుక్రవారం జరిగిన మారణకాండపై ఓ వ్యక్తి అభ్యంతరకర కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డాడు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఉద్యోగి ఒకరు .. 50మంది ప్రాణాలు కోల్పోయిన న్యూజిలాండ్ కాల్పుల ఘటనపై ఫేస్బుక్లో రెచ్చగొట్టే పోస్టు చేశాడు. ‘పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు న్యూజిలాండ్ మసీదు ఘటనతో సంతోష పడతారు. ప్రతి శుక్రవారం మసీదులపై ఇలాంటి దాడులు జరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. భారత్‌లో కూడా ఇదే తరహా ఘటనలు జరగాలి. ఆ మతస్తులను ఎప్పుడూ నమ్మలేం’ అంటూ రాసుకొచ్చాడు. రోణి సింగ్ పేరుతో పేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించి మత విద్వేషం ప్రదర్శించాడు. ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ట్రాన్స్‌గార్డ్ అప్రమత్తమైంది. అంతర్గత విచారణ చేపట్టి నిందితున్ని గుర్తించింది. అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించింది. (న్యూజిలాండ్ సంచలన నిర్ణయం) ‘జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న దుబాయ్‌లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు. అందుకే న్యూజిలాండ్ ఘటనపై అభ్యంతరకర కామెంట్లు చేసిన సదరు వ్యక్తిని అధికారులకు అప్పగించాం. అతను చట్టపరంగా విచారణ ఎదుర్కోక తప్పదు’ అని ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఎండీ గ్రెగ్ వార్డ్ స్పష్టం చేశాడు. అయితే, సదరు వ్యక్తి పేరు, వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. (చదవండి : న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి) -
న్యూజిలాండ్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ ప్రధామంత్రి జసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గతవారం క్రైస్ట్‌చర్చ్ మసీదులో కాల్పుల మారణహోమం ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని జసిండా అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. అలాగే కఠినమైన తుపాకీ చట్టాల చట్టం ఏప్రిల్ 11 నాటికి తీసుకురానున్నామని చెప్పారు. ఈ తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్ విధించినట్టు జసిండా వివరించారు. మార్చి 15న క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో బ్రెంటన్ అనే ఆస్ట్రేలియా యువకుడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 50మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన స్పందించిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఇకపై రైఫిళ్లను ఎవరు బడితే వాళ్లు కొనే ఛాన్స్ లేకుండా కట్టడి చేసింది. ఇందుకు సంబంధించి మిలిటరీలో వాడే అన్ని రకాల తుపాకులనూ బయటి మార్కెట్లో అమ్మడాన్ని నిషేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. అసాల్ట్ రైఫిల్స్, ఎక్కువ శక్తిమంతమైన రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు. ఈ చర్యలతో న్యూజిలాండ్‌లో ఉగ్రవాద చర్యలను దాదాపు పూర్తిగా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
‘ఆమె ఇక రాదు.. నువ్వు ఇంటికి వెళ్లు’
క్రైస్ట్‌చర్చ్ : బంగ్లాదేశ్‌కు చెందిన హుస్నా తన 19 ఏట ఫరీద్ అహ్మద్‌ను వివాహం చేసుకుని తొలిసారి న్యూజిలాండ్ గడ్డ మీద అడుగు పెట్టింది. గత పాతికేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోనంగా జీవిస్తూ.. ప్రేమ, సంతోషం అనే పునాదుల మీద ఓ అందమైన పొదరింటిని నిర్మించుకున్నారు. మాతృ దేశాన్ని విడిచి.. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి దాన్నే తన సొంత ఇంటిగా భావించి.. ప్రేమించింది హుస్నా. ఆర్నెళ్లు గడిచేలోపే ఇంగ్లీష్ నేర్చుకుంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంది. భర్తకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలుస్తూ.. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఫరీద్ ఇంట్లోనే హోమియోపతి మందుల దుకాణాన్ని నడుపుతుండేవాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వారి అన్యోన్యతను చూసి విధికి సైతం కన్ను కుట్టింది. అందుకే ఉగ్రదాడి రూపంలో వారి పాతికేళ్ల దాంపత్య జీవితాన్ని ముక్కలు చేసింది. ఎప్పటిలానే దైవ ప్రార్థనల నిమిత్తం మసీదుకెళ్లిన హుస్నాను మరణం ఉన్మాది రూపంలో వెంటాడింది. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం పూట న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరిగిన ఈ దారుణ సంఘటనలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. ఇలా మరణించిన వారిలో ఫరీద్ భార్య హుస్నా కూడా ఉన్నారు. ప్రార్థనల నిమిత్తం మసీదుకు వెళ్లినప్పుడు.. జరిగిన నరమేధంలో ఉగ్రవాది హుస్నాను ఫుట్‌పాత్ మీదనే కాల్చేశాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా వీల్ చైర్‌కే పరిమితమైన ఫరీద్ మసీదులో కాకుండా బయట ఉండే చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటుండటం వల్ల ఈ దారుణం నుంచి తప్పించుకోగలిగాడు. పేలుళ్ల శబ్దం వినిపడగానే సంఘటనా స్థలానికి వచ్చిన ఫరీద్‌కు అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మరి కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. వారిలో హుస్నా కూడా ఉన్నారు. జరిగిన దారుణం అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది ఫరీద్‌కు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి.. ‘మీ భార్య ఇక ఎన్నటికి తిరిగి రారు. మీరు రాత్రంతా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెప్పింది. ఆ మాట వినగానే మూగ బోయాడు ఫరీద్. తన ప్రపంచమే కుప్పకూలిపోయిందంటూ విలపించాడు. (‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’) జరిగిన దారుణం గురించి ఫరీద్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హుస్నా మాటలు, నవ్వులతో కిలకిలలాడే నా ఇళ్లు ఈ రోజు మూగబోయింది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని నేను క్షమిస్తున్నాను. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి, అతనిలానే ఆలోచించే అతని స్నేహితులకు నేనిచ్చే సందేశం ఇదే. ఇప్పటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కౌగిలించుకుని.. మీ ముఖంలోకి చూస్తూ.. నా మనస్పూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మిమ్మల్ని ద్వేషించను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు తల్లి, తండ్రి, నేస్తం. ఇతరుల మేలు కోరే వ్యక్తి తను. వేరొకరి జీవితాన్ని కాపాడ్డం కోసం ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది’ అంటూ భార్యను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఫరీద్. ఈ నరమేధానికి పాల్పడిన వారిలో ఒకరిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెటంన్ టారంట్(28)గా గుర్తించారు పోలీసులు. (చదవండి : ‘అతని పేరును ఎవరూ పలకరాదు’) -
‘అతని పేరును ఎవరూ పలకరాదు’
క్రైస్ట్‌చర్చ్ : ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్(28) అనే ఉగ్రవాది ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మరణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి అనైతికంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించాడని, అతని పేరును తాను ఎప్పుడూ ప్రస్తావించనని చెప్పారు. దేశ ప్రజలు కూడా అతని పేరును ఉచ్చరించొద్దని కోరారు. కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి కానీ.. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఎక్కడ ఉచ్చరించకూడదని చెప్పారు. అతనో ఉగ్రవాది, క్రిమినల్, తీవ్రవాది అని, తాను మాట్లాడుతున్నప్పుడు అతని పేరును ప్రస్తావించబోనన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. జాత్యహంకారంతో ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. (న్యూజిలాండ్‌లో నరమేధం) -
భద్రతకే ప్రథమ ప్రాధాన్యం
కరాచీ: ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావివ్వబోమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో జరిగిన ఉగ్ర నరమేధంలో 50 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకు న్నారు. అనంతరం కివీస్‌తో జరగాల్సిన మూడో టెస్ట్‌ను రద్దుచేసుకున్న బంగ్లాదేశ్ తక్షణమే స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్ రద్దుకు ఐసీసీ సైతం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఆదివారం పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన పాక్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తుదిపోరులో విజేతకు బహుమతులు అందించేందుకు హాజరైన ఐసీసీ సీఈవో మీడియాతో మాట్లాడారు. కివీస్‌లో జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూ రాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతకే మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నాడు. ‘ఇప్పటికే సెక్యూరిటీ విషయంలో ఐసీసీ అత్యంత జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్‌కప్ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే యుకే, వేల్స్ క్రికెట్ బోర్డులు ఆ దేశ అధికారులకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. అయితే, క్రైస్ట్‌చర్చ్ ఘటన తర్వాత రక్షణ ఏర్పాట్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు’ అని వెల్లడించాడు. -
మోదీ ఎందుకు ట్వీట్ చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై మార్చి 15న దాడి జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యను తీవ్రంగా ఖండిస్తూ పలువురు దేశాధినేతలు సొంత ట్విట్టర్ ఖాతాల ద్వారా స్పందించారు. బాధితులకు నివాళులర్పించారు. ఆ మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ నిర్ధారించినప్పటికీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంతవరకు తన సొంత ట్విట్టర్ ద్వారా స్పందించక పోవడం పట్ల విమర్శకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలే కాకుండా పాకిస్థాన్‌లో జరిగిన టెర్రరిస్టు దాడుల సందర్భాల్లో కూడా తక్షణమే స్పందించి మృతులకు నివాళులర్పించే మోదీ ఏకంగా 50 మంది పొట్టన పెట్టుకున్న ఉన్మాది చర్యపై స్వయంగా స్పందించక పోవడం ఏమిటన్నది వారి ప్రశ్న. అయితే అదే రోజు నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేస్తూ న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్దర్న్‌కు ఓ లేఖ రాశారంటూ భారత విదేశాంగ శాఖ ఓ లేఖను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడియు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తదితరులు వ్యక్తిగతంగా స్పందిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపారు. భారత్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తదితరులు వ్యక్తిగత ఖాతాలా ద్వారా సోషల్ మీడియాలో స్పందించారు. పెషావర్ స్కూల్లో టెర్రరిస్టు దాడికి 156 మంది చనిపోయినప్పుడు 2014, డిసెంబర్లో ప్రధాని మోదీ తన ట్వట్టర్లో స్పందించారు. 2015, జనవరి నెలలో పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంలో టెర్రరిస్టులు దాడి చేసి 17 మందిని చంపినప్పుడు కూడా మోదీ వెంటనే స్పందించారు. ఆ తర్వాత మే నెలలో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు ఓ బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 46 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. గత మార్చి 14వ తేదీన ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతనెలో ఓ భాగం కూలి ఆరుగురు మరణించినప్పుడు కూడా మోదీ స్వయంగా స్పందించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈసారి ఆయన సొంతంగా స్పందించక పోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జరిగిన దాడులకు ముస్లిం టెర్రరిస్టులు బాధ్యులవడం, న్యూజిలాండ్‌లో జరిగిన దాడికి ఓ శ్వేత జాత్యాహంకారి బాధ్యుడు అవడం, అందులోనూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం లాంటి అంశాలను ఆయన దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా స్పందించకపోయి ఉండవచ్చన్నది విమర్శకుల వాదన. -
నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం
క్రైస్ట్‌చర్చ్ : న్యూజీలాండ్‌లో జరిగిన దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ సెసేటర్కు ఊహించని అవమానం జరిగింది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన దాడిలో 49 మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు ముస్లింలే కారణమంటూ ఆస్ట్రేలియన్ సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ఓ టీనేజర్.. అన్నింగ్పై గుడ్డుతో దాడి చేశాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. మసీదులపై దాడి అనంతరం అన్నింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు న్యూజిలాండ్‌లో జరిగిన రక్తపాతానికి ముస్లింలే కారణం. న్యూజిలాండ్ ముస్లిం వలసదారులకు స్వర్గధామంగా మారింది. వారి జనాభా పెరిగిపోవడం వల్లే ఇలా జరిగింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడిన మరుసటి రోజే అన్నింగ్ మెల్బోర్న్లో మీడియాతో మాట్లాడుతుండగా ఓ బాలుడు వెనక నుంచి వచ్చి అన్నింగ్ తలపై గుడ్డు పగలకొట్టాడు. అంతటితో ఊరుకోక ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో కూడా తీశాడు. అనుకోని సంఘటనకు షాక్‌కు గురయిన అన్నింగ్ వెంటనే ఆ యువకుడిపై దాడికి దిగాడు. అనంతరం బాలున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జనాలు. After the Christchurch terrorist attack, Australian senator Fraser Anning released a statement saying, "Let us be clear, while Muslims may have been the victims today, usually they are the perpetrators..." So, a 17-year-old smacked him with an egg.pic.twitter.com/P8wEv6GR4F — UberFacts (@UberFacts) March 16, 2019 అయితే అన్నింగ్ తీరుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆయనను సెనేట్ నుంచి తొలగించాలని ఇప్పటికే కొన్ని పిటిషన్లు సిద్ధమయ్యాయి. ఇందులో 2,25,000 మంది సంతకాలు కూడా చేశారు. (మృతుల్లో ఐదుగురు భారతీయులు) -
మృతుల్లో ఐదుగురు భారతీయులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, అసీఫ్ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్ ఖదీర్ హైదరాబాద్ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్ ఫరాజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. క్రైస్ట్ చర్చ్ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్ నానమ్మ చెప్పారు. కాగా, టారంట్ కాల్పుల ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు. బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్ అజీజ్.. లిన్‌వుడ్ మసీదులో హంతకుడు టారంట్ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్ తొలుత కేవలం క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్ బెదిరించడంతో టారంట్ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
-
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్‌ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్‌కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు. పీజీ చదువుతున్న ఆన్సీ.. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్‌తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్‌చర్చ్‌లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్‌కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. -
భారత్ యూరప్ శత్రువు
క్రైస్ట్‌చర్చ్: కొత్త తరహా నాజీ విధానాలు, యూరప్ దేశాలకు పెరుగుతున్న వలసలే క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణకాండ సృష్టించడానికి తనను పురికొల్పాయని 49 మందిని పొట్టనబెట్టుకున్న దుండగుడు తెలిపాడు. యూరప్‌లో తమ జనాభాను పెంచుకుంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్, చైనా, టర్కీ దేశాలు యూరప్‌కు శత్రువులని అభివర్ణించాడు. దాడికి పాల్పడే ముందు 28 ఏళ్ల బ్రెంటన్ టారంట్..‘ది గ్రేట్ రిప్లేస్మెంట్’ పేరిట ఆన్లైన్లో ఉంచిన పోస్ట్‌లో ఈ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. శ్వేతేతర వలసదారులు శ్వేతజాతీయుల స్థానాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నాడు. శ్వేతజాతీయుల గుర్తింపునకు సరికొత్త చిహ్నంగా నిలిచిన ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నానన్న టారంట్..జాతీయవాద అతివాదులే తనకు స్ఫూర్తి అని చాటుకున్నాడు. ‘వలసదారులు ఎక్కడి నుంచి వచ్చినా వారిని అంతమొందించాలి. ఇండియా, టర్కీ, రోమా(భారత్ నుంచి యూరప్‌కు వలసెళ్లిన సంచార జాతులు), యూదులు, ఆఫ్రికా దేశాల ప్రజలు మనవాళ్లు కాకున్నా ఇక్కడ నివసిస్తున్నారు. వారిని చంపేయాల్సిందే. మారణహోమానికి రెండేళ్లుగా ప్రణాళికలు వేస్తున్నా. 2017 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఫ్రాన్స్ లేదా ఇతర ఉత్తర ఐరోపా దేశాల్లో దాడికి పాల్పడాలని అనుకున్నా. మూడు నెలల క్రితమే క్రైస్ట్‌చర్చ్‌ను ఎంచుకున్నా’ అని టారంట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, క్రైస్ట్‌చర్చ్ కాల్పుల తరువాత గల్లంతైన ఏడుగురు భారతీయులు, ఇద్దరు భారత సంతతి వ్యక్తుల జాడ తెలుసుకోవడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు భారత హైకమిషన్ వెల్లడించింది. టారంట్‌పై హత్యానేరం.. క్రైస్ట్‌చర్చ్ దాడి అనుమానితుడు బ్రెంటన్ టారంట్‌పై కోర్టు శనివారం హత్యానేరం మోపింది. ఏ మాత్రం పశ్చాత్తాపం చెందని అతడు అదే అహంకారంతో ‘ఓకే’ అని వెటకారంగా సంకేతాలిచ్చాడు. బెయిల్‌కు కూడా విజ్ఞప్తి చేసుకోలేదు. అతనికి జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. టారంట్‌ను పోలీస్ కస్టడీకి పంపిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అల్ నూర్ మసీదు సమీపంలో ఏర్పాటుచేసిన స్మారకం వద్ద ప్రజలు పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. క్రైస్ట్‌చర్చ్ వచ్చిన ప్రధాని జెసిండా బాధిత కుటుంబాలను ఓదార్చారు. ‘తుపాకీ’ చట్టాలు మారుస్తాం.. దేశంలో తుపాకీ వినియోగ చట్టాన్ని కఠినతరం చేస్తామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ప్రకటించారు. క్రైస్ట్‌చర్చ్ దాడి అనుమానితుడు చట్టబద్ధంగానే ఆయుధాలు కొనుగోలు చేశాడని తేలింది. టారంట్ ఆయుధ కొనుగోలు విషయాలు తెలిశాక ప్రజలు సంబంధిత చట్టంలో మార్పులు కోరుకుంటున్నారని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాడికి ముందు ఆన్లైన్లో విద్వేషపూరిత పోస్టు పెట్టినా కూడా టారంట్‌తో పాటు అరెస్ట్ అయిన అతని ఇద్దరు సహచరులపై నిఘా వర్గాల వద్ద సమాచారం లేదని తెలిపారు. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల మృతులకు వెల్లింగ్టన్లో పుష్పాలతో నివాళులు -
‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’
‘మీరు ధైర్యంగా ఇక్కడ ఉండండి. మమ్మల్ని క్షమించండి. నిజానికి మేము అలాంటి వాళ్లం కాదు. అటువంటి సంకుచిత మనస్తత్వం గల వ్యక్తులు ఎప్పటికీ గెలవలేరు. ప్రేమను ఎంచుకోండి. ప్రశాంతంగా జీవించండి’ అంటూ న్యూజిలాండ్ వాసులు క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. తమ దేశంలో ముస్లిం సోదరుల పట్ల జరిగిన అమానుష చర్యకు క్షమాపణలు చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా సరే తమను సంప్రదించాలంటూ బొటానికల్ గార్డెన్లో.. పెద్దలు ఫోన్ నంబర్లు షేరు చేస్తుండగా.. పిల్లలు తమ బొమ్మలు, పువ్వులు, గ్రీటింగ్ కార్డులు అక్కడ ఉంచి శాంతి సందేశం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కాల్పుల మోతతో దద్దరిల్లిన లిన్‌వుడ్ మసీదు ఇమామ్ ఇబ్రహీం అబ్దుల్ హలీం మాట్లాడుతూ..: ‘ తూటాలు తప్పించుకునేందుకు ప్రతీ ఒక్కరు నేలపై పడి వదిలివేయమని అర్థించారు. అయినా దుండగులు కనికరం చూపలేదు. సమీపంలో ఉన్న మహిళలు ఏడ్వడం బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టారు. అయితే మేము ఇప్పటికీ ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాము. నా పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను. ఈ ఘటన ద్వారా తీవ్రవాదులు మాలో ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం సడలించలేరు. ఇటువంటి ఆపత్కర సమయంలో మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి బాధిత కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా లిన్‌వుడ్ మసీదులో సుమారు ఏడుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. చదవండి : న్యూజిలాండ్‌లో నరమేధం ఇక అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉన్న, ప్రశాంతతకు మారుపేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో జాత్యహంకారి జరిపిన నరమేధం పట్ల న్యూజిలాండ్ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలపై జరిగిన ఈ దాడి హేయమైనదని ఖండిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఉద్వేగానికి గురయ్యారు. చదవండి : ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం ‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు -
ఉన్మాద కాండ
భూగోళంలో ఒక మూలకు విసిరేసినట్టుగా, ఇతర ప్రాంతాలతో సంబంధం లేనట్టుగా, పసిఫిక్ మహా సముద్రంలో ఒంటరిగా కనబడే న్యూజిలాండ్ రెండు వేర్వేరు దీవుల సముదాయం. ప్రపం చంలో ఐస్లాండ్ తర్వాత అది అత్యంత శాంతియుతమైన దేశంగా రెండో స్థానంలో ఉంది. ఆ స్థానం గత పదేళ్లుగా చెక్కు చెదరలేదు. అటువంటిచోట నెత్తురు రుచి మరిగిన పులిలా ఒక ఉన్మాది రెండు మసీదుల్లోకి చొరబడి ప్రార్థనల్లో నిమగ్నమైనవారిని తుపాకులతో విచక్షణారహితంగా కాలుస్తూ పోవడమే కాదు... దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఫేస్బుక్లో అందరూ వీక్షించేలా వీడియో తీసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. క్రైస్ట్‌చర్చి నగరంలో జరిగిన ఈ ఊచకోతలో 49 మంది కన్నుమూయగా వారిలో భారతీయులు 9మంది ఉన్నారని చెబుతున్నారు. 40మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్మార్గం నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన క్రికెట్ జట్టు సభ్యులు త్రుటిలో తప్పిం చుకోగలిగారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పినట్టు ఆ దేశ చరిత్రలో శుక్రవారం నిజంగా చీకటిరోజు. హంతకుడు ఈ ఊచకోతకు ముందు ఫేస్బుక్లో విడుదల చేసిన 74 పేజీల మేనిఫెస్టో నిండా విద్వేషంతో నిండిన రాతలే ఉన్నాయి. ‘మహా పునఃస్థాపనం’ (ది గ్రేట్ రీప్లేస్ మెంట్) పేరిట ఆన్లైన్లో ఉంచిన ఆ డాక్యుమెంట్లో ముస్లింలపై విస్మయకరమైన వ్యాఖ్యలు న్నాయి. అంతేకాదు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అందులో ఆకాశానికెత్తారు. ఇదే శీర్షి కతో గతంలో ఫ్రాన్స్‌లో విడుదలైన ఒక డాక్యుమెంటు వలసదారుల జనాభా పెరుగుతూ పోతున్న దని, త్వరలో యూరప్ జనాభాను వారు అధిగమించే ప్రమాదమున్నదని అందరినీ బెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఈ హంతకుడికి ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో పుట్టుకొచ్చిన శ్వేతజాతి దురహంకారులు ఆదర్శమని మేనిఫెస్టో తేటతెల్లం చేస్తోంది. హంతకుడు స్థానికుడు కాడని, ఆస్ట్రే లియా నుంచి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారాన్నిబట్టి వెల్లడవుతోంది. అసహనాన్ని నూరిపోయడం, విద్వేషాన్ని వెదజల్లడం పర్యవసానాలెలా ఉంటాయో ఈ ఉదంతం చూస్తే అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూల విద్వేషం పుట్టుకొచ్చినా, ఎక్కడ మతి మాలిన చర్యలు జరిగినా సామాజిక మాధ్యమాల విస్తృతి అపారంగా పెరిగిన వర్తమానకాలంలో అవి క్షణాల్లో ఖండాంతరాలకు చేరుతాయి. ఎక్కడో ఒకచోట వాటిని అనుకరించే ఉన్మాదులూ బయల్దేరతారు. ఇలాంటి ప్రమాదం గురించి ఎందరో తరచు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటివి హింసాత్మకమైన ఘటనల్ని, అందుకు ప్రోత్సహించేవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తామని చెబుతూనే ఉన్నాయి. అందుకు అవసరమైన సాంకేతికపరమైన రక్షణ చర్యలు తీసుకున్నామంటున్నాయి. హింసను ప్రోత్సహించేలా, విద్వేషాలను వ్యాపింపజేసేలా ఉన్న సందేశాలను పసిగట్టే కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెబుతున్నాయి. అందు కోసం ఏటా కోట్లాది డాలర్లు వ్యయం చేస్తున్నాయి. నిరుడు అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటివి అప్లోడ్ చేసిన వీడియోల్లో 99 శాతం ఆ మార్గంలోనే తొలగించామని ఫేస్ బుక్ చెప్పింది. కానీ ఆచరణలో అవి అంత ప్రయోజనకరంగా ఉండటం లేదని ఈ ఉదంతంతో రుజువైంది. న్యూజి లాండ్ ఊచకోతకు కారణమైన హంతకుడు ఈ దారుణాన్నంతటినీ 17 నిమిషాలపాటు ప్రత్యక్షంగా చిత్రిస్తున్నా ఈ మాధ్యమాలన్నీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాయి. కనుక తమ సాంకేతికతలో లోపం ఎక్కడుందో ఈ మాధ్యమాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ శాంతియుత దేశమే కావొచ్చుగానీ... అది ఏ క్షణంలోనైనా భగ్నమయ్యేందుకు దారితీసే స్థితిగతులు అక్కడున్నాయి. మతం పేరిట ప్రబలుతున్న ఉగ్రవాదం ఒకపక్కా, దాన్ని సాకుగా తీసుకుని విస్తరిస్తున్న శ్వేతజాతి దురహంకారం మరోపక్కా చుట్టుముడుతున్నా... శ్వేత జాతి దురహంకారం ఉగ్రవాదంగా పరిణమిస్తున్న జాడలు కనిపిస్తున్నా చాలా దేశాలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పైపెచ్చు ట్రంప్ వంటివారు తమ రాజకీయ స్వప్రయోజనాలను ఆశించి అసహనాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వెనకాముందూ చూడకుండా విద్వేషపూరితంగా మాట్లా డుతున్నారు. న్యూజిలాండ్‌లో ఈ ఉదంతం జరిగిన వెంటనే ఆస్ట్రేలియాలో మితవాద పార్లమెంటు సభ్యుడు ముస్లిం వలసదారులే ఈ ఘటనకు కారణమని మాట్లాడాడు. అదే సమయంలో భద్రత సక్రమంగా ఉండటం లేదు. నేరగాళ్లు ఏదైనా చర్యకు పూనుకొనేందుకు భయపడే రీతిలో పోలీసుల్ని వినియోగించే అలవాటు ఎటూ లేదు. కనీసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తున్న దాఖలాలు లేవు. బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఇటీవలికాలంలో హింసాత్మక ఘటనలు పెరగడం కన బడుతుంది. వీటన్నిటికీ తోడు న్యూజిలాండ్ చట్టాలు తుపాకుల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నాయి. అమెరికా తరహాలోనే ఇక్కడ కూడా జనం వద్ద రిజిస్టర్ కాని తుపాకులు 96 శాతం ఉన్నాయని గతంలో పలువురు హెచ్చరించారు. న్యూజిలాండ్‌లో పదహారేళ్లు నిండిన వారెవరైనా స్వేచ్ఛగా షాట్గన్లు, రైఫిళ్లు కొనుగోలు చేయవచ్చు. దగ్గర ఉంచుకునే మారణాయుధాల సంఖ్యపై కూడా పరిమితి లేదు. 2017నాటి గణాంకాల ప్రకారం 46 లక్షల జనాభాగల న్యూజి లాండ్లో పౌరుల వద్ద 12 లక్షల రిజిస్టర్డ్ ఆయుధాలున్నాయి. 1990లో ఒక పౌరుడు తమ పొరు గింటివారితో ఘర్షణ పడి 13మందిని కాల్చి చంపాక తుపాకుల చట్టాలను సవరించారు. అప్పటినుంచీ సైన్యం వాడే సెమీ ఆటోమేటిక్ ఆయుధాల కొనుగోలుపై ఆంక్షలున్నాయి. లైసెన్స్ ఉన్నవారికి తప్ప వాటిని విక్రయించరు. తుపాకులు అందరికీ అందుబాటులో ఉంటున్నా న్యూజి లాండ్లో జరిగే హత్యల సంఖ్య స్వల్పం. ఏదేమైనా అసహనం, విద్వేషం, ప్రతీకారం వంటివి ప్రబోధించే వారిపట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో... వాటిని మొగ్గలోనే తుంచకపోతే ఎటువంటి పరిస్థితులు దాపురిస్తాయో తాజా ఉదంతం వెల్లడిస్తోంది. న్యూజిలాండ్ ఉదంతం ప్రపంచ దేశా లన్నిటికీ గుణపాఠం కావాలి. -
బంగ్లాదేశ్ బెంబేలు..!
సరిగ్గా పదేళ్ల క్రితం 3 మార్చి, 2009... లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని టీమ్ బస్సుపై తుపాకులతో దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఆటగాళ్లు ప్రాణాలతో బయటపడ్డా ఆ భయం సుదీర్ఘ కాలం పాటు వారిని వీడలేదు. ఈసారి క్రైస్ట్‌చర్చ్ మసీదులో లక్ష్యం క్రికెటర్లు కాకపోవచ్చు... కానీ క్షణాల వ్యవధిలో ప్రాణాలు దక్కించుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లను అడిగితే తెలుస్తుంది ఆ సమయంలో వారి గుండెలు ఎలా కొట్టుకున్నాయో! అందుబాటులో ఉన్న దారి నుంచి పరుగెత్తి స్టేడియం చేరుకునే వరకు వారి ఒక్కో అడుగులో ప్రాణభయం కనిపించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో శనివారం నుంచి జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేసుకొని బంగ్లాదేశ్ స్వదేశం పయనమైంది. క్రైస్ట్‌చర్చ్: మసీదులో తీవ్రవాదులు జరిపిన దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన మస్జిద్ అల్ నూర్లోకి ఆ జట్టు ఆటగాళ్లు ప్రవేశించబోతున్న సమయంలోనే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. అప్పటికి వారంతా టీమ్ బస్సులోనే ఉన్నారు. అయితే బస్సులోనే ఉండిపోతే నేరుగా తమపైనే దాడి జరగవచ్చని భావించిన వారంతా వెంటనే దిగేసి తలో దారి చూసుకున్నారు. ఎవరికి వారు విడివిడిగా స్టేడియం వైపు పరుగులు తీశారు. భయంతో వణికిపోతూనే ముందుగా తాము ప్రాక్టీస్ చేస్తున్న హాగ్లీ ఓవల్ స్టేడియానికి పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి హోటల్ గదుల్లోకి వెళ్లిపోయారు. అనంతరం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో బంగ్లాదేశ్ బోర్డు చర్చించిన అనంతరం మిగిలిన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుమతినిచ్చింది. ఏం జరిగిందంటే... బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడుతు న్న మ్యాచ్‌లను కవర్ చేస్తూ న్యూజిలాండ్‌లోనే ఉన్న సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ ఇసామ్ కథనం ప్రకారం... శనివారం నుంచి బంగ్లా, కివీస్ మధ్య మూడో టెస్టు జరగాల్సి ఉంది. దీనికి ముందు శుక్ర వారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనేందుకు బంగ్లా హాగ్లీ ఓవల్ గ్రౌండ్‌కు వచ్చింది. అయితే వర్షం కారణంగా మైదానం పరిస్థితి బాగా లేదు. మైదానానికి దగ్గరలోనే మసీదు ఉండటంతో ఇండోర్ ప్రాక్టీస్‌కు ముందు తాము శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని ఆటగాళ్లు చెప్పారు. దాంతో టీమ్ బస్సులో సహాయక సిబ్బందితో కలిసి మొత్తం 17 మంది అక్కడకు వెళ్లారు. వారు మసీదుకు చేరువగా వెళ్లినా ఇంకా బస్సు దిగలేదు. కొద్దిసేపటికే బంగ్లా బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ‘ఇక్కడ ఫైరింగ్ జరుగుతోంది. మమ్మల్ని రక్షించండి’ అంటూ ఆ జర్నలిస్ట్‌కు ఫోన్ చేశాడు. ముందుగా హాస్యమాడుతున్నాడని అనుకున్నా తర్వాత ఫో¯Œ లో తీవ్రత అర్థమయ్యాక అతను మసీదు వైపు పరుగెత్తుకు వెళ్లాడు. ఆ సమయంలో అప్పటికే కాల్పులు జరగడంతో పరిస్థితి దారుణంగా ఉంది. ఆటగాళ్లంతా బస్సు వైపు వెళ్లకుండా మరోవైపు పరుగెత్తడం కనిపించింది. చాలా మంది ఆటగాళ్లే తీవ్రవాదుల లక్ష్యం కావచ్చని కూడా భావించారు. క్రికెటర్లంతా ఒక్కసారిగా కనిపించిన వారిని హాగ్లీ ఓవల్ మైదానానికి దారి ఎటు అని అడుగుతూ అటువైపు పరుగెత్తారు. అప్పటికే కళ్ల ముందు రక్తపాతాన్ని చూసిన వారందరూ భయంతో వణుకుతూనే ఏదోలా స్టేడియం లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని సురక్షితంగా హోటల్‌కు పంపించారు. కొంత ముందుగా వెళ్లి ఉంటే... దేవుడి దయ వల్ల తాము పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని బంగ్లాదేశ్ మేనేజర్ ఖాలెద్ మసూద్ అన్నాడు. ‘మేం ఆ సమయంలో మసీదుకు దాదాపు 50 గజాల దూరంలో ఉన్నాం. అప్పుడే జనాలు రక్తమోడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కనిపించాయి. అంత భయంలో కూడా మా బుర్ర పని చేసింది. అందుకే బస్సు దిగి వేగంగా పరుగెత్తాం. లేదంటే ఇంకా ఏమైనా జరిగేదేమో. మరో మూడు, నాలుగు నిమిషాల ముందు మసీదుకు వెళ్లినా బాధితుల్లో మేం కూడా ఉండేవాళ్లం’ అని మసూద్ ఘటనను వివరించాడు. షూటర్ల బారినుంచి మా జట్టు మొత్తం తప్పించుకోగలిగింది. ఇదో భయంకర అనుభవం. – తమీమ్ ఇక్బాల్, బంగ్లా క్రికెటర్ దేవుడే రక్షించాడు. మేం చాలా అదృష్టవంతులం. జీవితంలో మళ్లీ ఇలాంటి ఘటన జరగకూడదు. – ముష్ఫికర్ రహీమ్, బంగ్లా క్రికెటర్ ఎన్నో ఏళ్లుగా మా దేశంలో ఎన్నో పెద్ద ఈవెంట్లు జరిగాయి. అందరికంటే భిన్నంగా, ప్రశాంతంగా మాదైన చిన్న ప్రపంచంలో బతుకుతున్నామని భావించా. కానీ ఇది చాలా బాధాకరమైన రోజు. దీనిని మాటల్లో చెప్పలేను. – జిమ్మీ నీషమ్, న్యూజిలాండ్ క్రికెటర్ విషాద ఘటనతో తీవ్రంగా నిర్ఘాంతపోయాను. బంగ్లాదేశ్ టీమ్ గురించి ఆందోళనకు లోనయ్యా. మరణించినవారి గురించి ఎంతో బాధగా ఉంది. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ న్యూజిలాండ్ ప్రశాంతమైన దేశం. ఈ ఘటన ఎంతో విషాదకరం. తమీమ్‌తో మాట్లాడాక మనసు కుదుటపడింది. – షాహిద్ అఫ్రిది, పాక్ మాజీ ఆటగాడు -
‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు
సాక్షి, న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి శుక్రవారం ఓ సాయుధ దుండగుడు జొరబడి ప్రార్థన చేస్తున్న ముస్లింలు లక్ష్యంగా దాడులు జరపడంతో దాదాపు 49 మంది మత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి ముందే దుండగుడు తనను తాను బ్రెంటన్ టారెంట్ అనే 28 ఏళ్ల యువకుడిగా ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. జన్మతా ఆస్ట్రేలియాకు చెందిన టారెంట్ శ్వేత జాత్యాహంకారిగా ఆయన తన ఆయుధాలపై, సైనిక దుస్తులపై, చేతి గ్లౌజులపై రాసుకున్న పేర్లను బట్టి తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సామ్రాజ్యాలపై దండయాత్రలు జరిపి విజయం సాధించిన చారిత్రక పురుషుల పేర్లను, అలాంటి యుద్ధాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన వారి పేర్లను తనకు స్ఫూర్తిదాయకంగా రాసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాసుకున్న దాదాపు 50 పేర్లలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. 1. డేవిడ్ సోస్లాన్ :12,13వ శతాబ్దానికి చెందిన జార్జియా కింగ్ పేరు. ఆయన ఇరుగు, పొరుగు ముస్లిం దేశాలపై తరచుగా యుద్ధాలు చేశారు. 2. జార్జియా నాలుగవ డేవిడ్: ఈయన ‘డేవిడ్ ది బిల్డర్’గా సుపరిచితులు. జార్జియా చరిత్రలోనే ఆయన తనకు తాను గొప్ప చక్రవర్తిగా చెప్పుకునే వారు. 1121లో జరిగిన డిడ్గోరి యుద్ధంలో టర్కీష్ దళాలను దేశం నుంచి తరమికొట్టారు. దేశంలోని పలు ప్రాంతాలను తన స్వాధీనంలోకి తీసుకున్నారు. 3. దిమిట్రి సెన్యామిన్: 1787-92, 1806-12 రెండు రష్యా, టర్కీష్ యుద్ధాల్లో వీరోచిత పాత్ర వహించిన రష్యన్ అడ్మిరల్. 4. సెర్బాన్ కాంటాకుజ్నో: రొమానియన్ మాజీ యువరాజు. యూరప్ నుంచి టర్కీలను తరిమికొట్టారు. 5. మార్కో మిల్జానొవ్: మాంటెనెగ్రిన్ జనరల్. ఆయన కూడా టర్కీలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. తనకు తాను సమర్థుడైన నాయకుడిగా చెప్పుకున్న వ్యక్తి. 6. స్టెఫన్ లజారెవిక్ : సెర్బియా రాజు. టర్కీష్లకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించుకున్న వ్యక్తి. 7. ఎడ్వర్డ్ కాండ్రింఘ్టన్ : తొలుత బ్రిటీష్ అడ్మిరల్‌గా, ఆ తర్వాత కమాండర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. గ్రీక్ స్వాతంత్య్ర ఉద్యమం సందర్భంగా టర్కీలకు, ఈజిప్టులకు వ్యతిరేకంగా పోరాడారు. 8. మార్కో అంటోనియో బ్రగాడిన్ : వేనిస్ రిపబ్లిక్ ఆఫీసర్. సైప్రస్‌పై టర్కీల దాడిని తీవ్రంగా ప్రతిఘటించి ఆ తర్వాత టర్కీష్ జనరల్ చేతుల్లో మరణించారు. 9. ఎర్నెస్ట్ రూడిగర్ స్టార్ఎంబెర్గ్ : ఆస్ట్రేలియా జాతీయవాద రాజకీయ వేత్త. ఆస్ట్రేలియా క్యాథిలిక్ క్రిస్టియానిటి రక్షణ కోసం ‘ఫాదర్లాండ్ ఫ్రంట్’ అనే ఫాసిస్టు సంస్థను స్థాపించిన నాయకుడు. యువకుడిగా ఉండగానే ఆయన జర్మనీకి వెళ్లి అక్కడ హిట్లర్‌ను, నాజీలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారు. మసీదులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టారెంట్‌పై ఈయన ప్రభావమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆన్లైన్లో టారెంట్ తన ఒక్కరి గురించె చెప్పుకున్నాడు. తనకు అనుచరులు ఉన్నట్లు కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే దాడిలో ఆయన అనుచరులు కూడా పాల్గొన్నట్లు న్యూజిలాండ్ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం -
వైరల్ : ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం
-
వైరల్ : ఫేస్బుక్ లైవ్‌తో రాక్షసానందం
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పాశవిక చర్యకు పాల్పడ్డ దుండగులు. మసీదుల్లోని గదుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్న దృశ్యాల్ని ఫేస్బుక్లో లైవ్‌స్ట్రీమ్ చేసి రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో వచ్చిన అతడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపి, ఆ తర్వాత లోనికి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. ఇక తమ దేశానికి వలస వచ్చిన వారిని, మైనారిటీ వర్గాల జనాభా పెరగడాన్ని సహించలేకే దుండగుడు జాత్యంహకార చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. 49 మంది మృతి ‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు కాగా ఈ ఘటనను ఉగ్రదాడిగా భావిస్తున్నామని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జసీండా ఆర్డెర్న్.. ‘న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. -
న్యూజిలాండ్‌లో కాల్పులు
-
‘అదొక భయానక ఘటన’
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులే లక్ష్యంగా దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్లారు. దాంతో బంగ్లా క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడటంతో ఐసీసీతో పాటు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజర్ ఖలేద్ మషూద్ మాట్లాడుతూ.. అదొక భయానక ఘటనగా పేర్కొన్నాడు. ‘ ఆ కాల్పుల కలకలం ఒక సినిమాను తలపించింది. రక్తం కారుతూ ప్రజలు పరుగులు తీశారు. మేము ప్రార్ధనలు ముగించుకుని బస్సు వద్దకు చేరుకునే సమయంలో ఈ దారుణం జరిగింది. దీన్ని మేము ఎవరూ ఊహించలేదు. దాదాపు మా జట్టు సభ్యులంతా ప్రార్ధనలు చేసుకోవడానికి మసీదుకు వెళ్లాం. కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే హోటల్లో ఉన్నారు. ఆ కాల్పులు జరిగిన సమయానికి ఐదు నిమిషాలే ముందే మేము బయటకొచ్చాం. దాంతోనే సురక్షితంగా బయటపడ్డాం’ అని అక్కడ అనుభవాన్ని ఖలేద్ పంచుకున్నారు. ఇక్కడ చదవండి: న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి -
న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మజీదులే లక్ష్యంగా దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళతో పాటు ముగ్గురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజని ఆదేశ ప్రధాన్ని అభివర్ణించారు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో 27 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే లిన్‌వుడ్ మసీదులోనూ మరో ఆగంతుకుడు కాల్పులకు పాల్పడ్డాడని, ఒంటినిండా ఆయుధాలు ధరించి ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు. కాగా, అల్ నూర్ మసీదు వద్ద కాల్పులు జరిపిన దుండగుడు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. , కారులో వచ్చిన దుండగుడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపి, ఆ తర్వాత లోనికి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. -
న్యూజిలాండ్‌లో కాల్పులు.. బంగ్లా క్రికెటర్ల ఎస్కేప్!
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్, క్రిస్ట్‌చర్చ్ సెంట్రల్ సిటీలోని హగ్లీపార్క్ మజీదులో దుండగులు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పేట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్‌చర్చ్ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న.. బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్ కోచ్ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్‌లో భూకంపం
7.8 తీవ్రత.. ఇద్దరు మృతి వెల్లింగ్టన్: భారీ భూకంపం దెబ్బకు న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీప నగరం క్రైస్ట్‌చర్చ్ అతలాకుతలమైంది. ఆదివారం సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవంతులు నేలమట్టమయ్యారుు. ఇద్దరు మరణించారు. ఇంకొందరి జాడ గల్లంతయ్యింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. భారీ భూకంపం నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నగరానికి 90కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది. క్రై స్ట్చర్చిలో భూమి చాలా సేపు కంపించినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపింది. తాను నివసించే ప్రాంతంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించింది. భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లవచ్చని పేర్కొంది. 2011 ఫిబ్రవరిలో ఇక్కడ 6.3 భూకంప తీవ్రతతో భూమి కంపించింది. ఈ దుర్ఘటనలో 185 మంది మృతిచెందారు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత 7.8 కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
-
న్యూజిలాండ్‌లో భూకంపం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం లేదు. క్రైస్ట్ చర్చ్‌కు తూర్పున 15 కిలో మీటర్ల దూరంలో 8 కిలో మీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. కాగా సునామీ వచ్చే అవకాశముందని న్యూజిలాండ్ వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. 2011లో క్రైస్ట్ చర్చ్‌ను భారీ భూకంపం కుదిపేసింది. అప్పట్లో 185 మంది మరణించగా, అపార ఆస్తి నష్టం జరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మళ్లీ భూమి కంపించింది. -
మెక్కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 429 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ విజృభించి ఆడాడు. 5 పరుగులతో తేడాతో అతడు డబుల్ సెంచరీ కోల్పోయాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కేవాడు. విలియమ్సన్(54), నీషమ్(85) అర్థ సెంచరీలు చేశారు. లాథమ్ 27, రూథర్‌ఫోర్డ్ 18, వాల్టింగ్ 26 పరుగులు చేశారు. రాస్ టేలర్(7) రనౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. లక్మాల్, ఎరంగ, ప్రసాద్, కౌషాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.