Ind VS SA 1st Test Highlights: Matt Henry Takes 7 Wickets, South Africa All Out With 95 Runs - Sakshi
Sakshi News home page

NZ Vs SA 1st Test: 7 వికెట్లతో చెలరేగిన కివీస్‌ బౌలర్‌.. 95 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా

Published Thu, Feb 17 2022 12:49 PM | Last Updated on Thu, Feb 17 2022 1:50 PM

NZ Vs SA 1st Test: Matt Henry 7 wicket Haul SA All Out For 95 Runs NZ Lead - Sakshi

South Africa Tour Of New Zealand 2022- 1st Test Day 1: దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ బౌలర్‌ మాట్‌ హెన్రీ అద్భుతంగా రాణించాడు. తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు పడగొట్టి ప్రొటిస్‌ జట్టును కోలుకోకుండా చేశాడు. దీంతో 95 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ నిమిత్తం సౌతాఫ్రికా న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17న క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య కివీస్‌కు హెన్రీ శుభారంభం అందించాడు. తొలుత ప్రొటిస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(1 పరుగు)ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మార్కరమ్‌(15), డసెన్‌(8) వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. హంజా(25), వెరెనె(18), రబడ(0), స్టర్‌మాన్‌(0) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఓవర్లు వేసిన హెన్రీ... 23 పరుగులు ఇచ్చి మొత్తంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 

పేసర్‌ హెన్రీకి తోడు జెమీషన్‌, టిమ్‌ సౌథీ, వాగ్నర్‌ తలా ఓ వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌కు ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(15), విల్‌ యంగ్‌(8) శుభారంభం అందించలేకపోయారు. కాన్వే(36), హెన్రీ నికోల్స్‌(37- బ్యాటింగ్‌) రాణించారు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్‌ 116 పరుగులు చేసింది. 21 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నికోల్స్‌, వాగ్నర్‌ క్రీజులో ఉన్నారు.

చదవండి: Ind Vs WI 1st T20: 'అది వైడ్‌బాల్‌ ఏంటి' రోహిత్‌ అసహనం.. కోహ్లి సలహా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement