న్యూజిలాండ్‌ కాల్పుల కలకలం.. 49 మంది మృతి | 49 killed in Massacre And all Mosques Across New Zealand shut  | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ కాల్పుల కలకలం.. 49 మంది మృతి

Published Fri, Mar 15 2019 12:50 PM | Last Updated on Fri, Mar 15 2019 2:17 PM

40 killed in Massacre And all Mosques Across New Zealand shut  - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని మజీదులే లక్ష్యంగా దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళతో పాటు ముగ్గురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ విషయాన్ని పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు. న్యూజిలాండ్‌ చరిత్రలోనే ఇదో చీకటి రోజని ఆదేశ ప్రధాన్ని అభివర్ణించారు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో 27 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడ్డారు. 

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే లిన్‌వుడ్‌ మసీదులోనూ మరో ఆగంతుకుడు కాల్పులకు పాల్పడ్డాడని, ఒంటినిండా ఆయుధాలు ధరించి ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు. కాగా, అల్‌ నూర్‌ మసీదు వద్ద కాల్పులు జరిపిన దుండగుడు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌ టారెంట్‌గా తెలుస్తోంది. , కారులో వచ్చిన దుండగుడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపి, ఆ తర్వాత లోనికి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement