క్రైస్ట్‌చర్చ్ : న్యూజీలాండ్‌లో జరిగిన దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ సెసేటర్‌కు ఊహించని అవమానం జరిగింది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన దాడిలో 49 మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు ముస్లింలే కారణమంటూ ఆస్ట్రేలియన్ సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ఓ టీనేజర్.. అన్నింగ్‌పై గుడ్డుతో దాడి చేశాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.
మసీదులపై దాడి అనంతరం అన్నింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు న్యూజిలాండ్‌లో జరిగిన రక్తపాతానికి ముస్లింలే కారణం. న్యూజిలాండ్ ముస్లిం వలసదారులకు స్వర్గధామంగా మారింది. వారి జనాభా పెరిగిపోవడం వల్లే ఇలా జరిగింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడిన మరుసటి రోజే అన్నింగ్ మెల్‌బోర్న్‌లో మీడియాతో మాట్లాడుతుండగా ఓ బాలుడు వెనక నుంచి వచ్చి అన్నింగ్ తలపై గుడ్డు పగలకొట్టాడు. అంతటితో ఊరుకోక ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో కూడా తీశాడు. అనుకోని సంఘటనకు షాక్‌కు గురయిన అన్నింగ్ వెంటనే ఆ యువకుడిపై దాడికి దిగాడు. అనంతరం బాలున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జనాలు.
After the Christchurch terrorist attack, Australian senator Fraser Anning released a statement saying, "Let us be clear, while Muslims may have been the victims today, usually they are the perpetrators..."
— UberFacts (@UberFacts) March 16, 2019
So, a 17-year-old smacked him with an egg.pic.twitter.com/P8wEv6GR4F
అయితే అన్నింగ్ తీరుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆయనను సెనేట్ నుంచి తొలగించాలని ఇప్పటికే కొన్ని పిటిషన్లు సిద్ధమయ్యాయి. ఇందులో 2,25,000 మంది సంతకాలు కూడా చేశారు. (మృతుల్లో ఐదుగురు భారతీయులు)
Comments
Please login to add a commentAdd a comment