
న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పాశవిక చర్యకు పాల్పడ్డ దుండగులు. మసీదుల్లోని గదుల్లో తిరుగుతూ కాల్పులు జరుపుతున్న దృశ్యాల్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసి రాక్షసానందం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో వచ్చిన అతడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపి, ఆ తర్వాత లోనికి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. ఇక తమ దేశానికి వలస వచ్చిన వారిని, మైనారిటీ వర్గాల జనాభా పెరగడాన్ని సహించలేకే దుండగుడు జాత్యంహకార చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.
న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. 49 మంది మృతి
‘వారి’ స్ఫూర్తితోనే ఉన్మాది కాల్పులు
కాగా ఈ ఘటనను ఉగ్రదాడిగా భావిస్తున్నామని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జసీండా ఆర్డెర్న్.. ‘న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment