వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ క్రిస్ట్‌చర్చ్ సిటీలోని మసీదులే లక్ష్యంగా దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది. ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్లారు. దాంతో బంగ్లా క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు వారంతా సురక్షితంగా బయటపడటంతో ఐసీసీతో పాటు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ మేనేజర్ ఖలేద్ మషూద్ మాట్లాడుతూ.. అదొక భయానక ఘటనగా పేర్కొన్నాడు. ‘ ఆ కాల్పుల కలకలం ఒక సినిమాను తలపించింది. రక్తం కారుతూ ప్రజలు పరుగులు తీశారు. మేము ప్రార్ధనలు ముగించుకుని బస్సు వద్దకు చేరుకునే సమయంలో ఈ దారుణం జరిగింది. దీన్ని మేము ఎవరూ ఊహించలేదు. దాదాపు మా జట్టు సభ్యులంతా ప్రార్ధనలు చేసుకోవడానికి మసీదుకు వెళ్లాం. కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే హోటల్‌లో ఉన్నారు. ఆ కాల్పులు జరిగిన సమయానికి ఐదు నిమిషాలే ముందే మేము బయటకొచ్చాం. దాంతోనే సురక్షితంగా బయటపడ్డాం’ అని అక్కడ అనుభవాన్ని ఖలేద్ పంచుకున్నారు.
ఇక్కడ చదవండి: న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment