
న్యూజిలాండ్‌లో భూకంపం
వెల్లింగ్టన్: భారీ భూకంపం దెబ్బకు న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీప నగరం క్రైస్ట్‌చర్చ్ అతలాకుతలమైంది. ఆదివారం సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవంతులు నేలమట్టమయ్యారుు. ఇద్దరు మరణించారు. ఇంకొందరి జాడ గల్లంతయ్యింది. స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. భారీ భూకంపం నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నగరానికి 90కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది. క్రై స్ట్‌చర్చిలో భూమి చాలా సేపు కంపించినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపింది. తాను నివసించే ప్రాంతంలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించింది. భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లవచ్చని పేర్కొంది. 2011 ఫిబ్రవరిలో ఇక్కడ 6.3 భూకంప తీవ్రతతో భూమి కంపించింది. ఈ దుర్ఘటనలో 185 మంది మృతిచెందారు. తాజాగా సంభవించిన భూకంప తీవ్రత 7.8 కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]