ఆరో రోజూ జాడలేని మలేసియా విమానం
Published Fri, Mar 14 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
కౌలాలంపూర్/న్యూఢిల్లీ: మలేసియా విమానం అదృశ్యంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. గురువారం ఆరో రోజు కూడా దాని ఆచూకీ దొరకలేదు. భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన 43 నౌకలు, 40 విమానాలు గాలించినా ఫలితం లేకపోయింది. గాలింపులో భారత్‌కు చెందిన నాలుగు యుద్ధనౌకలు, ఆరు విమానాలు పాల్గొంటున్నాయి. మరోపక్క.. విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్న వియత్నాం, మలేసియా మధ్య గల సముద్ర జలాల్లో మూడుచోట్ల తేలా డే వస్తువులను చైనా ఉపగ్రహాలు గుర్తించాయి. అయితే అక్కడికెళ్లిన తమ విమానాలకు, నౌకలకు శకలాల్లాంటివేవీ కనిపించలేదని మలేసియా, వియత్నాం ప్రభుత్వాలు తెలిపాయి.
విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాక కూడా నాలుగు గంటలు ప్రయాణించినట్లు రాడార్ సంకేతాల ద్వారా తెలుస్తోందని అమెరికా దర్యాప్తు అధికారులు చెప్పారు. అయితే మలేసియా దీన్ని తోసిపుచ్చింది.
Advertisement