మలేషియాలోని ప్రసిద్ధ కినబారు పర్వత శ్రేణులు (ఫైల్) 11 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందింది ఇక్కడే
- 17 మంది గల్లంతు
కౌలాలంపూర్: మలేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భుకంపం ధాటికి 11 మంది పర్వతారోహకులు మృతి చెందగా, 17 మంది ఆచూకీ గల్లంతయింది. రనావు జిల్లాలోని ప్రసిద్ధ కినబాలు పర్వతశ్రేణుల్లోనే ఈ మరణాలు సంభవించడం విషాదం. మృతులు పర్వాతారోహణ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సింగపూర్ కు చెందిన 12 ఏళ్ల పర్వతారోహకుడు, అతని సహాయకుడి (30 ఏళ్ల వ్యక్తి) మృతదేహాలను కినబాలు పర్వతం నుంచి కిందికి తెచ్చామన్నారు.
గల్లంతైనవారిలో ఎనిమిది మంది సింగపూర్ పౌరులు, ఆరుగురు మలేషియన్లు, చైనా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలకు చెందిన ఒకొక్కరు ఉన్నట్లు పేర్కొన్నారు. కినబాలు పర్వతానికి అతి సమీపంగా.. 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మలేషియా వాతావరణ సంస్థ అధికారులు వెల్లడించారు. రిక్కర్ స్కేలుపై దాని తీవ్రత 5.9 గా నమోదయింది.