'శుభలగ్నం' సీన్లను తలపించేలా లవ్ స్టోరీ.. | Malaysian Girl wants to buy others lover at cost of crore rupees | Sakshi
Sakshi News home page

'శుభలగ్నం' సీన్లను తలపించేలా లవ్ స్టోరీ..

Published Fri, May 19 2017 12:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM

ప్రేమజంట జోయి టాన్, డానీ టాన్

ప్రేమజంట జోయి టాన్, డానీ టాన్

వేరే వ్యక్తి భర్తని కోటి రూపాయలకు కొనుక్కోవడం జగపతిబాబు, ఆమని, రోజా నటించిన 'శుభలగ్నం' లో చూశాం. డబ్బుపై మోజుతో ఆమని తన భర్త జగపతిబాబును రోజాకు అమ్ముకుంటుంది. అయితే దాదాపు అలాంటి సీన్‌ మలేషియాలో చోటుచేసుకుంది. ఓ యువతి మరోకరి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించింది. అతడికి తన వివరాలు చెబుతూ లోబర్చుకోవాలని చూసింది. కానీ ఆమె యత్నాలు ఫలించలేదు. దీంతో అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను వేధించింది, చివరి ప్రయత్నంగా 1.5 కోట్ల రూపాయాలు ఇస్తానని ఆశచూపింది. డబ్బు కాదు ప్రియుడే ముఖ్యమని చెప్పింది. అందరి మనసులు గెలుచుకుంది.

మలేషియాకి చెందిన 38ఏళ్ల జోసి లీ, డానీ టాన్‌ అనే యువకుడిని ప్రేమించింది. కానీ డానీకి అప్పటికే జోయి టాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అంత వయసున్నా టీనేజ్ యువతిగా కనిపించే జోసిది ధనిక కుటుంబ నేపథ్యం. మొదట్లో డానీతో పరిచయం పెంచుకుంది. ఆపై నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేకపోతే నేను ఉండలేనంటూ బాంబు పేల్చింది. తనకు ప్రేయసి ఉందన్న విషయం తెలిసినా ఇలా జోసి ఇలా చేయడంతో డానీ సీరియస్ అయ్యాడు. 20 ఏళ్ల నుంచి మనమిద్దరం కలిసే తిరిగాం, ఇప్పుడేమైంది అంటూ జోసి లేనిపోని పోస్టింగ్స్‌ పెట్టేది. ఆమె సోషల్ మీడియా అకౌంట్ల మెసెజ్‌లు రాకుండా బ్లాక్ చేశాడు డానీ. ప్రేమించే ఉద్దేశం లేదని తన వైఖరి స్పష్టం చేయగా తన వ్యక్తిగత వివరాలు చెబుతూ ప్రేమించాలంటూ మానసికంగా వేధింపులకు పాల్పడింది. డానీ తనను ప్రేమించడని డిసైడైన జోసి మరోవైపు నుంచి స్టోరీని నడిపాలనుకుంది.

డానీని కొనాలని చూసిన జోసి లీ

డానీ ప్రేయసి జోయి టాన్‌ను కలిసి నీ ప్రియుడు కావాలని, అతడిని ప్రేమిస్తున్నానని జోసి చెప్పింది. మా ప్రేమను ఓడించలేరని జోయి తేల్చి చెప్పడంతో వేధింపులకు గురిచేసేది. ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడేది. చివరి ప్రయత్నంగా రూ.1.5 కోట్లు ఇస్తాను .. డానీని నాకు వదిలేయ్ అంటూ జోయికి భారీ ఆఫర్ ఇచ్చింది. నా లవర్‌ను ఎవరికీ వదులుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ నేను బ్రేకప్ చెప్పినా.. డానీ నిన్ను మాత్రం ప్రేమించడన్న విషయం తెలుసుకోమని జోయి సూచించింది. ముందు నీ రేటెంతో చెప్పు.. అవసరమైతే నేనే నీకు డబ్బులు సర్దుతానంటూ జోసి లీకి డానీ లవర్ జోయి రివర్స్ ఆఫర్ తో షాకిచ్చింది. ఆఫర్ వివరాలను జోయి టాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా జరిగిందని వివరించింది. జోయి చర్యను నెటిజన్లు కొనియాడారు. మంచి పని చేశావు. ముర్ఖపు ఆలోచనతో ఉన్న జోసి లీకి భలే బుధ్దిచెప్పావు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement