స్వలింగ సంప్కరులపై దాడి: 40 ఏళ్ల జైలు | Man convicted of throwing boiling water on same-sex couple | Sakshi
Sakshi News home page

స్వలింగ సంప్కరులపై దాడి: 40 ఏళ్ల జైలు

Published Fri, Aug 26 2016 10:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

స్వలింగ సంప్కరులపై దాడి: 40 ఏళ్ల జైలు

స్వలింగ సంప్కరులపై దాడి: 40 ఏళ్ల జైలు

అట్లంటా: స్వలింగ సంప్కరులపై దాడి చేసినందుకు అమెరికాలోని అట్లాంటాలో ఓ వ్యక్తికి కోర్టు 40 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మార్టిన్ బ్లాక్వెల్ అనే వ్యక్తి తన ప్రియురాలి కొడుకు ఆంథోని గూడెన్, అతడి భాగస్వామి మార్క్వెజ్ టొల్బెర్ట్ పై దాడి చేశాడు. నిద్రపోతున్న సమయంలో వారిద్దరిపై మరుగుతున్న నీళ్లు పారబోశాడు. తీవ్రగాయాలపాలైన వీరిద్దరూ చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాలిన గాయాలతో నరకయాతన అనుభవించామని న్యాయస్థానంలో బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

మార్టిన్ బ్లాక్వెల్ ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి 40 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గూడెన్ తల్లితో నిందితుడు గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన కుమారుడిపై బ్లాక్వెల్ దాడి చేయడాన్ని ఆమె ఖండించింది. కోర్టు తీర్పును బాధితులు స్వాగతించారు. ఏదో ఒకనాటిని బ్లాక్వెల్ ను క్షమిస్తానని టొల్బెర్ట్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement