boiling water
-
ఏంటీ?.. మరుగు నీటి సరోవరమా!
ప్రపంచంలో అక్కడక్కడా వేడినీటి బుగ్గలు ఉంటాయి. వేడినీటి బుగ్గల్లోని నీళ్లు సాధారణంగా స్నానానికి అనువుగా ఉంటాయి. డోమనికా రాజధాని రోసోకు చేరువలోని మోర్నె ట్రాయిస్ పిటోన్స్ నేషనల్ పార్కులో ఏకంగా మరుగునీటి సరోవరం ఉంది. దీనిని తొలిసారిగా 1870లో ఇద్దరు బ్రిటిష్ వ్యక్తులు గుర్తించారు. ఈ సరోవరంలోని నీటి ఉష్ణోగ్రత 82 డిగ్రీల నుంచి 92 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇందులోని నీరు నిత్యం సలసల మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటుంది. డోమనికా వచ్చే విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా ఈ సరోవరం చూడటానికి వస్తుంటారు. దీని ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుంటారు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
వైరల్: మరిగే నీరు.. క్షణాల్లో మంచుగా!
చికాగో: ఓ మగ్గులో మరిగే నీటిని తీసుకొని పైకి విసిరితే ఏమవుతుంది? మనపైనే పడి.. ఒళ్లంతా కాలుతుంది! అయితే ఓ వ్యక్తి తాజాగా ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియోలో మాత్రం మరుగుతున్న నీరు.. అలా ఆకాశంలోకి విసరగానే మంచులా మారి, మాయమైపోతోంది. క్షణాల్లో జరుగుతున్న ఈ అద్భుతాన్ని నెటిజన్లు చూసి అవాక్కవుతున్నారు. అయితే అతడేమీ మ్యాజిక్ చేయడంలేదు. అంతా ప్రకృతి వింతే. అసలు విషయమేంటంటే.. పోలార్ వోర్టెక్స్ ప్రభావంతో అమెరికాలోని పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో విలవిల్లాడుతున్నాయి. చివరికి ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతాల్లో ఒకటైన నయాగారా సైతం గడ్డకట్టేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే భయాందోళనలకు గురిచేస్తున్న ఈ చలి కొందరికి వినోదాన్ని సైతం పంచుతోంది. కొందరు మంచుతో రకరకలా ప్రయోగాలు చేసేస్తున్నారు. చిత్ర విచిత్ర ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘చలి కారణంగా రాజకీయ నేతలు తమ జేబులోనే చేతులు పెట్టుకొని ఉండటం చూస్తున్నాం..’ అంటూ కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. -
స్వలింగ సంప్కరులపై దాడి: 40 ఏళ్ల జైలు
అట్లంటా: స్వలింగ సంప్కరులపై దాడి చేసినందుకు అమెరికాలోని అట్లాంటాలో ఓ వ్యక్తికి కోర్టు 40 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మార్టిన్ బ్లాక్వెల్ అనే వ్యక్తి తన ప్రియురాలి కొడుకు ఆంథోని గూడెన్, అతడి భాగస్వామి మార్క్వెజ్ టొల్బెర్ట్ పై దాడి చేశాడు. నిద్రపోతున్న సమయంలో వారిద్దరిపై మరుగుతున్న నీళ్లు పారబోశాడు. తీవ్రగాయాలపాలైన వీరిద్దరూ చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాలిన గాయాలతో నరకయాతన అనుభవించామని న్యాయస్థానంలో బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మార్టిన్ బ్లాక్వెల్ ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి 40 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గూడెన్ తల్లితో నిందితుడు గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. తన కుమారుడిపై బ్లాక్వెల్ దాడి చేయడాన్ని ఆమె ఖండించింది. కోర్టు తీర్పును బాధితులు స్వాగతించారు. ఏదో ఒకనాటిని బ్లాక్వెల్ ను క్షమిస్తానని టొల్బెర్ట్ అన్నాడు.