బాంబు పెడుతూ పేలిపోయాడు | man dies of bamb blast | Sakshi
Sakshi News home page

బాంబు పెడుతూ పేలిపోయాడు

Published Fri, Apr 17 2015 6:16 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

man dies of bamb blast

పెషావర్: పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ గురువారం పాక్‌లోని ఖైబర్ ట్రైబల్ ప్రాంతంలో రోడ్డుపక్కన బాంబును అమర్చబోతూ అనుకోకుండా అది పేలిపోవడంతో ముక్కచెక్కలై మరణించాడు. ఈ విషయాన్ని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. అయితే టెర్రరెస్టు వర్గాలు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. ప్రపంచంలో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టుగా అమెరికా ముద్ర వేసిన హఫీజ్‌తోపాటు మరో ఇద్దరు అతని అనుచరులు బాంబు పేలుడు ఘటనలో మరణించారని పాకిస్తాన్ సైనిక వర్గాలు తెలిపాయి.


అయితే ఆ చనిపోయిందీ హఫీజ్ అవునా, కాదా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని ఆ వర్గాలు చెప్పాయి. ఇంతకుముందు పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు నాయకత్వం వహించినా హఫీజ్ ఆ తర్వాత ఐఎస్‌ఐఎస్ గ్రూప్‌లో చేరిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement