ట్రంప్‌కోసం బాలీవుడ్ నటి ఆట..పాట
న్యూయార్క్: ఎన్నికల ప్రచార బాధ్యతలు ముగిసిన తర్వాత మరోసారి బాలీవుడ్ నటి, మోడల్ మనస్వీ మాంగాయి అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూర్చొనున్న వేదికపై కనిపించనుంది. ఆయనకు స్వాగతం చెబుతూ నిర్వహించే ఉత్సవానికి బాధ్యత వహించడమే కాకుండా అదే వేదికపై ఆడిపాడనుంది.
ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నుంచి మనస్వీ పాల్గొంది. ఆ తర్వాత శుక్రవారం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కోసం స్వాగత కార్యక్రమంలో పాలుపంచుకోనుంది. ఈ కార్యక్రమాన్ని లింకన్ మెమోరియల్ వద్ద నిర్వహించనున్నారు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ 2010 కూడా బాలీవుడ్‌లో హిట్ సాంగ్స్‌గా పేరొందిన కాలా చష్మా, జుమ్మేకిరాత్, ధూమ్ మాచాలే, జయహో వంటి గీతాలను ప్రదర్శించనున్నారు.