ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చి పనులు! | Medical staff suspended after dancing around patient preparing for surgery | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చి పనులు!

Published Fri, Mar 31 2017 6:53 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చి పనులు!

ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చి పనులు!

న్యూయార్క్: ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్‌మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్ ఐసీయూలో ట్రీట్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటే వారి బంధువులు ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఇందుకు భిన్నంగా పిచ్చిపని చేసిన ఐదుగురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వైపు పేషెంట్ కాలిన గాయాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు సర్జరీ చేయాల్సిన డాక్టర్, సిబ్బంది(అంతా మహిళలే) మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తూ అందరూ విస్తుపోయేలా చేశారు.

కొలంబియాలోని బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఉదంతం వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోగికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారని.. ఆపరేషన్ థియేటర్‌లో ఇవేం పిచ్చిపనులు అంటూ ఆ మహిళా సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆస్పత్రి మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంది. సర్జరీ సమయంలో పేషేంట్‌కు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంది. ఆ సిబ్బందిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ట్రీట్‌మెంట్ సందర్భంగా కొన్ని నియమాలు పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement