women staff
-
పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం అనే నారీశక్తి నినాదానికి మరింత మద్దతు పలికింది ఎయిర్ఇండియా. మార్చి ఒకటోతేదీ నుంచి 90 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి మహిళా సిబ్బందితోనే నడిపింది! బుధవారం సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మొత్తం 1,825 మంది పైలెట్లలో 15 శాతం మంది అంటే 275 మంది పైలెట్లు మహిళలేనని పేర్కొంది. ఎయిర్ఇండియా మొత్తం సిబ్బందిలో 40 శాతానికిపైగా నారీమణులే ఉండటం విశేషం. కాక్‌పిట్ క్రూలో 15 శాతం అతివలే. ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది కమర్షియల్ ఉమెన్ పైలెట్లు ఉన్న దేశం భారత్’ అని ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ‘ వైమానిక రంగ సంబంధ వృత్తులను ఎంచుకుంటున్న భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించగలిగే అవకాశం వచ్చింది’ అని ఆయన అన్నారు. -
మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకార్వో) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి.. వైస్ ప్రెసిడెంట్స్ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్ మేనేజర్‌గా, ఎస్.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్ మెయింటెనెన్స్‌లో, ట్రైన్ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్ మేనేజర్స్‌గా, టికెట్ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్ డివిజన్ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు. -
ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది. దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు. చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ.. -
మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్
పుణె: ఆటోమోటివ్ తయారీ రంగంలో మహిళా సిబ్బందిని పెంచే దిశగా పినకిల్ ఇండస్ట్రీస్ కొత్తగా ‘ఎవల్యూషనారీ’ పేరిట వినూత్న ప్రయోగం చేపట్టింది. కేవలం మహిళలను మాత్రమే నియమించుకునేందుకు ఫిబ్రవరి 23, 24న మధ్యప్రదేశ్ పిఠంపూర్‌లోని తమ ప్లాంటులో రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. ఆసక్తి గల మహిళా అభ్యర్ధులు httpr:// pinnac eindurtrier. com/ evo utionari& campaifn/లో లేదా పినకిల్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదు చేసుకోవచ్చని లేదా నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని సంస్థ తెలిపింది. కెరియర్లో విరామం తీసుకున్నప్పటికీ అర్హత కలిగిన మహిళా ఇంజినీర్లు, నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రెసిడెంట్ అరిహంత్ మెహతా తెలిపారు. మెకానికల్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉన్న ఇంజినీర్లతో పాటు ఆర్అండ్డీ, ఆపరేషన్స్, స్టోర్స్ తదితర విభాగాల్లోనూ నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. ఆటోమోటివ్ సీటింగ్, ఇంటిరీయర్స్, రైల్వే సీటింగ్ మొదలైన విభాగాల్లో పినాకిల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
Women Army Officers: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్‌లో...
ఆకాశంలో సగం కాదు... నింగి నేల నీరు దేనినైనా పూర్తిగా కమాండ్ చేస్తామంటోంది మహిళాలోకం కఠోరమైన శారీరక శ్రమ చేయాల్సిన కదనరంగాన్ని కూడా నడిపించడానికి ముందుకొచ్చింది.. దశాబ్దాలుగా ఎందరో మహిళా అధికారుల కల ఎట్టకేలకు నెరవేరింది. 100 మందికిపైగా మహిళలు పదోన్నతులు పొంది కల్నల్ స్థాయికి ఎదిగారు. భారత ఆర్మీలో చరిత్రాత్మక ముందడుగు పడింది. సియాచిన్ సహా వివిధ కమాండ్ యూనిట్లను మహిళలు కూడా ముందుండి నడిపించనున్నారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ బాధ్యతల్ని మొట్టమొదటి సారిగా మహిళలు కూడా నిర్వర్తించనున్నారు. రెజిమెంట్లు, బెటాలియన్లకు అధికార పదవుల్లో మహిళల నియామకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఈ నెల 9 నుంచి 22 వరకు జరిగింది. దాదాపుగా 108 మంది మహిళా అధికారులు కల్నల్‌గా పదోన్నతులు పొందారు. 1992 నుంచి 2006 బ్యాచ్‌కు చెందిన మహిళా అధికారులకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. వీరంతా ఇంజనీర్స్, సిగ్నల్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ కోర్, ఆర్మీ సర్వీస్ కోర్, ఆర్మీ ఆర్డన్స్ కోర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్స్ వంటి విభాగాలకు అధికారులుగా సేవలందిస్తారు. భారత సాయుధ బలగాల్లో 1992 నుంచి మహిళా అధికారులు ఉన్నారు. అయితే వారంతా షార్ట్ సర్వీసు కమిషన్ (ఎస్ఎస్సీ) అధికారులుగానే ఇన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లు, న్యాయవాదులు, వంటి అడ్మినిస్ట్రేటివ్ పాత్రలే పోషిస్తున్నారు. యుద్ధ క్షేత్రాల్లో గాయపడ్డ జవాన్లకి చికిత్స అందించే వైద్యులు, నర్సులుగా కూడా ఉన్నారు. 16–18 ఏళ్లు సర్వీసు ఉంటేనే కమాండర్ పదవికి అర్హత సాధిస్తారు. ఇప్పుడు కోర్ ఆఫ్ ఆర్టిలరీ, కంబాట్ సపోర్ట్ ఆర్మ్‌లలో మహిళా అధికారుల్ని నియమించనున్నారు. భారత వాయుసేన, నావికాదళంలో అన్ని విభాగాల్లో మహిళా అధికారులు ఉన్నారు. వారికి శాశ్వత కమిషన్లు కూడా ఉన్నాయి. యుద్ధ విమానాలను, యుద్ధ నౌకల్ని నడిపించే మహిళలూ ఉన్నారు. త్రివిధ బలగాల్లో అతి పెద్దదైన పదాతి దళంలో మాత్రమే మహిళల పట్ల ఇన్నాళ్లూ వివక్ష కొనసాగుతూ వచ్చింది. ఎందుకీ వివక్ష పురుషులతో పోలిస్తే మహిళల శారీరక దారుఢ్యంపైనున్న సందేహాలే ఇన్నాళ్లూ వారికి అవకాశాల్ని దూరం చేశాయి. మాతృత్వం, పిల్లల పోషణ, ప్రసూతి సెలవులు వంటివి మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలని, యుద్ధం ముంచుకొచ్చే నేపథ్యాల్లో అది సాధ్యం కాదనే వాదన వినిపించింది. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మహిళలకు ఎక్కడైనా పని చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. భారత వాయుసేన, నావికాదళంతో పోలిస్తే ఆర్మీలో వివక్ష ఎక్కువగా ఉంది. యుద్ధభూమిలో నేరుగా మహిళలుంటే శత్రు దేశానికి చిక్కితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికీ పోరాట క్షేత్రాల్లో మహిళా కమాండర్లను నియమించడానికి భారత సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. సుప్రీం తీర్పుతో నెరవేరిన కల భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, కమాండింగ్ పదవులు ఇవ్వాల్సిందేనని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా అందరికీ శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో ఆర్మీలో మహిళలు పురోగతి సాధించడానికి, నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదోన్నతులకు మార్గం సుగమమైంది. యూనిట్‌ను కమాండ్ చేయడమంటే..? పదాతి దళంలో క్షేత్రస్థాయిలో సైనికులందరికీ నేరుగా ఆదేశాలు ఇస్తూ వారిని ముందుకు నడిపించే కీలక బాధ్యత. ఇప్పటివరకు పురుషులు మాత్రమే నిర్వహించిన ఈ బాధ్యతల్ని మహిళలు కూడా అందుకున్నారు. సైన్యంలో కల్నల్ పదవి మహిళకి లభిస్తే ఆమె కనుసన్నల్లోనే సైన్యం నడుస్తుంది. బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ వంటి ఉన్నతాధికారులు నేరుగా సైనికులతో సంబంధాలను కొనసాగించరు. ఇలాంటి పదవుల్లోనే ఎన్నో సవాళ్లను మహిళలు ఎదర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మహిళల్లో నాయకత్వ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. ‘‘సియాచిన్‌లో మొట్టమొదటి మహిళా అధికారిగా శివ చౌహాన్‌ను నియామకం మాలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. స్త్రీ, పురుషులన్న భేదం లేకుండా ప్రతీ ఒక్కరికీ వారికి మాత్రమే సొంతమయ్యే సామర్థ్యాలుంటాయి. ఆర్మీలో మహిళలకు మంచి భవిష్యత్ ఉంది. శారీరక దారుఢ్యం ఉన్నవారు కూడా ఇన్నాళ్లూ వివక్ష కారణంగా పదవులకి దూరమయ్యారు. ఇక ఆ రోజులు పోయాయి’’ – దీక్షా ధామిన్, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి ‘‘ఆర్మీలోకి రావాలనుకునే మహిళల సంఖ్య ఇంకా పెరుగుతుంది. పోరాట క్షేత్రాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళా అధికారులు రావాలి. ఎందుకంటే మహిళలు ఎంతో చురుగ్గా, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో ఉంటారు’’ – దీప్‌నూర్ సహోతా, ఆర్మీకి శిక్షణ పొందుతున్న యువతి – సాక్షి, నేషనల్ డెస్క్ -
హన్మకొండ: ప్రసూతి ఆస్పత్రి మహిళా సిబ్బంది నిర్వాకం వైరల్
సాక్షి, హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందు పార్టీతో హల్ చల్ చేశారు వాళ్లు. ఏకంగా స్టాఫ్ రూమ్‌లో బీర్లు తాగుతూ చిలిపి చేష్టల విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. వైరల్ వీడియో ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్ మరొక జీఎన్ఎం కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్లు వెకిలి చేష్టలకు పాల్పడుతుండగా.. ఎవరో వీడియో తీశారో. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది మందు పార్టీతో ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్ గా మార్చిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో మందు పార్టీపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి. ‘వారం రోజుల క్రితం జరిగిన ఘటన తమ దృష్టికి రాగానే పిలిచి మందలించాను. స్టాప్ రూమ్ లో అలా చేయడం తప్పేనని సారీ చెప్పారంటున్న సూపరింటెండెంట్. మొదటి తప్పుగా భావించి మందలించి వదిలేశాము.ఇంకోసారి ఇలా జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాను. బర్త్‌డే పార్టీ సందర్భంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నామని వివరణ ఇచ్చారు’ అని తెలిపారు సూపరింటెండెంట్. -
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
వారున్న చోట మహిళా సిబ్బంది దూరం..
లక్నో : ఢిల్లీ మర్కజ్లో పాల్గొని తిరిగివచ్చి ఐసోలేషన్ వార్డుల్లో చేరిన తబ్లిగి జమాతే సభ్యుల సేవల కోసం పురుష సిబ్బందినే నియమించాలని అక్కడ మహిళా కానిస్టేబుళ్లు, నర్సులకు విధులు కేటాయించరాదని యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ ఆదేశించింది. కరోనా వైరస్ అనుమానితులుగా ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న కొందరు తబ్లిగీ జమాతే సభ్యులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆస్పత్రి నర్సులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో యూపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమాతే సభ్యులకు వైద్య, భద్రతా సేవల కోసం పురుష సిబ్బందినే ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘజియాబాద్ ఆస్పత్రిలో నర్సింగ్ సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించిన తబ్లిగీ జమాతే సభ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద చర్యలు చేపట్టాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని మానవత్వానికి శత్రువులుగా యోగి ఆదిత్యానాథ్ అభివర్ణించారు. నిందితులు చట్టాన్ని గౌరవించకపోవడమే కాకుండా సమాజ కట్టుబాట్లనూ అంగీకరించలేదని..వారు మానవత్వానికే శత్రువులని వ్యాఖ్యానించారు. ‘వారు మహిళా ఆరోగ్య కార్యకర్తల పట్ల వ్యవహరించిన తీరు హేయం..వారిపై ఎన్ఎస్ఏ కింద చర్యలు చేపడతాం..వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్ట’మని యోగి అన్నారు. మరోవైపు తబ్లిగి జమాతే సభ్యుల ప్రవర్తనపై కేంద్ర మంత్రి, ఘజియాబాద్ ఎంపీ వీకే సింగ్ మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ డాక్టర్లకు సహకరించాలని, మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. చదవండి : యాంటీ మలేరియా డ్రగ్‌తో డాక్టర్ మృతి -
ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చి పనులు!
-
ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చి పనులు!
న్యూయార్క్: ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్ ఐసీయూలో ట్రీట్మెంట్కు సిద్ధంగా ఉంటే వారి బంధువులు ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఇందుకు భిన్నంగా పిచ్చిపని చేసిన ఐదుగురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వైపు పేషెంట్ కాలిన గాయాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు సర్జరీ చేయాల్సిన డాక్టర్, సిబ్బంది(అంతా మహిళలే) మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తూ అందరూ విస్తుపోయేలా చేశారు. కొలంబియాలోని బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఉదంతం వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోగికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారని.. ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చిపనులు అంటూ ఆ మహిళా సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆస్పత్రి మేనేజ్మెంట్ ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంది. సర్జరీ సమయంలో పేషేంట్‌కు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంది. ఆ సిబ్బందిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ట్రీట్మెంట్ సందర్భంగా కొన్ని నియమాలు పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.