‘నవ యవ్వన’ బామ్మ! | Modern young 'grandmother! | Sakshi
Sakshi News home page

‘నవ యవ్వన’ బామ్మ!

Published Thu, Oct 16 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

‘నవ యవ్వన’ బామ్మ!

‘నవ యవ్వన’ బామ్మ!

మీరు రోజూ ఎన్ని పుషప్స్ తీస్తారు? పోనీ.. అప్పుడప్పుడైనా ఎన్ని తీయగలరు? ఈ చైనా బామ్మ మాత్రం రోజూ వంద పుషప్స్ తీస్తుంది. అదీ ఐదు నిమిషాల్లోనే! ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ గౌచువాన్ అనే ఈ పండుముసలి మొన్న జూలైలోనే 81వ పుట్టిన రోజును జరుపుకొన్నా.. ఇంకా 18 ఏళ్ల పడుచులా హుషారుగా ఆటలాడుతోంది. పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ఈ బామ్మ పుషప్స్‌తో పాటు సిటప్స్ తీయడం, బాస్కెట్‌బాల్ ఆడటం వంటివీ చేస్తుంది.

చకచకా పరుగులు పెట్టినట్లు నడవగలదు కూడా. అంతేకాదు.. సొంతంగా ‘రోలీ-పాలీ రోల్’ అనే వ్యాయామాన్నీ కనిపెట్టింది. ఇదెలా చేయాలంటే.. ముందుగా నేల మీద కూర్చోవాలి. పాదాలను చేతులతో గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇక పొర్లుదండాలు పెట్టినట్లు దొర్లడమే! ఈ ఎక్సర్‌సైజు ఎముకలు, కండరాలకు బలాన్నిస్తుందని చెప్పే ఈ బామ్మ ఇవి కూడా వంద వరకూ చేస్తుందట. ఈమెతో పోటీ పడే సత్తా ఉంటే మీరు కూడా ప్రయత్నించండి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement