పుషప్స్
మెన్స్ హెల్త్
పుషప్‌లను ఫిట్‌నెస్‌కు తిరుగులేని కొలమానం అంటుంటారు. ఫుషప్‌లు చేయడం మంచిదేగానీ... చాలా ఎక్కువగా చేయాలనే ఆరాటం వల్ల లేని సమస్యలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. రోజుకు ఎన్ని పుషప్స్ చేస్తున్నామనేదానికంటే, ఎంత ఖచ్చితంగా(పర్‌ఫెక్ట్) చేస్తున్నామనేదే ముఖ్యం. మనం సరైన పద్ధతిలో చేస్తున్నపుడు తల నుంచి కాలి వేలి వరకు కండరాలు కదులుతాయి. పుషప్‌లు చేస్తున్న సమయంలో టేబుల్ క్లాక్‌ను దగ్గర పెట్టుకోండి. ‘నిన్నటితో పోలిస్తే వేగంగా చేస్తున్నామా? వేగం తగ్గిందా?’ ఇలాంటి విషయాలను బేరీజు వేసుకోవచ్చు.