Fujian Province
-
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
తైవాన్‌లో చైనా బెలూన్ కలకలం
తైపీ: తైవాన్‌లో చైనా బెలూన్ తీవ్ర కలకలం సృష్టించింది. చైనా ప్రయోగించిన బెలూన్ తమ భూభాగంలో ల్యాండ్ అయ్యిందని తైవాన్ రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలోని తైయువాన్ సిటీలో ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందిన పరికరాలు ఇందులో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. చైనాలో అంతర్భాగమైన ఫుజియాన్ ప్రావిన్స్ తీరానికి సమీపంలోని తమ మాత్సూ ఐలాండ్‌లో భాగమైన తూంగ్యిన్లో ఈ బెలూన్ నేలపైకి దిగినట్లు తెలియజేసింది. ఈ ఉదంతంపై చైనాలోని తైయువాన్ వైర్లెస్(రేడియో) ఫస్ట్ ఫ్యాక్టరీ లిమిటెడ్ అధికారి స్పందించారు. ఆ బెలూన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే తాము అందజేశామని, బెలూన్ను తాము తయారు చేయలేదని పేర్కొన్నారు. ఆ కంపెనీ చైనా వాతావరణ శాఖకు అవసరమైన పరికరాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తైవాన్ భూభాగంలో దిగిన బెలూన్ వాతావరణాన్ని పరిశీలించేందుకు ప్రయోగించినదేనని స్పష్టం చేశారు. ఇలాంటి బెలూన్లు తైవాన్ జలసంధిపై ఎగరడం సాధారణమేనని, ఇప్పుడు మాత్రమే దీనిపై అందరి దృష్టి పడిందని వివరించారు. చైనా బెలూన్ను ఇటీవల అమెరికా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇరు దేశాల నడుమ మాటల యుద్ధం సాగుతోంది. -
గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..
సాధారణంగానే జలగలను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది రెండు నెలలకు పైగా ఒక వ్యక్తి శరీరంలో జలగలు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వివరాల్లోకి వెళితే.. చైనాలో ఒక వ్యక్తి రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం దగ్గుతుండగా రక్తం పడడంతో అనుమానమొచ్చి సదరు వ్యక్తి ప్యూజిన్ ఫ్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ హాస్పిటల్‌ను సంప్రదించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అతన్ని శ్వాసకోస విభాగానికి సిఫార్సు చేశారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి సిటీ స్కాన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించారు. రిపోర్టులను పరీక్షించిన డాక్టర్లు ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. వెంటనే సదరు వ్యక్తికి మత్తుమందు ఇచ్చి ట్వీజర్ సాయంతో ఆపరేషన్ నిర్వహించి 1.2 ఇంచులు ఉన్న రెండు జలగలను బయటికి తీశారు. ప్రసుత్తం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 'అతని గొంతులోంచి రెండు జలగలను బయటకు తీశాం. ప్రసుత్తం అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆ వ్యక్తి బహుశా జలగలు ఉన్న నీటిని తాగి ఉంటాడు. అయితే అవి కంటికి కనిపించని స్థితిలో ఉండడంతో గుర్తించలేకపోయాడు. కాగా, ఆ జలగలు రెండు నెలలుగా ఆ వ్యక్తి యొక్క రక్తం పీల్చుతూ పెరిగాయని' శ్వాసకోస విభాగధిపతి డాక్టర్ రావు గున్యాంగ్ తెలిపారు. -
‘నవ యవ్వన’ బామ్మ!
మీరు రోజూ ఎన్ని పుషప్స్ తీస్తారు? పోనీ.. అప్పుడప్పుడైనా ఎన్ని తీయగలరు? ఈ చైనా బామ్మ మాత్రం రోజూ వంద పుషప్స్ తీస్తుంది. అదీ ఐదు నిమిషాల్లోనే! ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ గౌచువాన్ అనే ఈ పండుముసలి మొన్న జూలైలోనే 81వ పుట్టిన రోజును జరుపుకొన్నా.. ఇంకా 18 ఏళ్ల పడుచులా హుషారుగా ఆటలాడుతోంది. పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న ఈ బామ్మ పుషప్స్‌తో పాటు సిటప్స్ తీయడం, బాస్కెట్‌బాల్ ఆడటం వంటివీ చేస్తుంది. చకచకా పరుగులు పెట్టినట్లు నడవగలదు కూడా. అంతేకాదు.. సొంతంగా ‘రోలీ-పాలీ రోల్’ అనే వ్యాయామాన్నీ కనిపెట్టింది. ఇదెలా చేయాలంటే.. ముందుగా నేల మీద కూర్చోవాలి. పాదాలను చేతులతో గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఇక పొర్లుదండాలు పెట్టినట్లు దొర్లడమే! ఈ ఎక్సర్సైజు ఎముకలు, కండరాలకు బలాన్నిస్తుందని చెప్పే ఈ బామ్మ ఇవి కూడా వంద వరకూ చేస్తుందట. ఈమెతో పోటీ పడే సత్తా ఉంటే మీరు కూడా ప్రయత్నించండి!