ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఉగ్రవాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని ఐక్యరాజ్య సమితి సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఆసిఫ్ ఈ విధంగా తిప్పికొట్టారు.
సోమవారం ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ఉగ్రవాదన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్ ఆరోపించిందని, కానీ వారి దేశం భారత్ ఓ ఉగ్రవాది చేతిలోనే నడుస్తుందన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారని, మోదీ గుజరాత్‌లో ముస్లింల రక్తం కళ్ల చూశాడని గుజరాత్ అల్లర్లను ఆసిఫ్ ప్రస్తావించారు. అంతేకాకుండా ఆర్‌ఎస్సెస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment