న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను జరిపే చర్చలు ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో ట్విట్టర్‌లో వెల్లడించారు. రష్యాలోని సోచి నగరంలో పుతిన్‌తో మోదీ సోమవారం అనధికారికంగా భేటీ అవనుండటం తెలిసిందే. ‘మైత్రీపూర్వక రష్యా ప్రజలకు వందనం. పుతిన్‌ను ఎప్పుడు కలుసుకున్నా నాకు అదొక సంతోషం’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఉగ్రవాదం, త్వరలో జరగనున్న ఎస్‌సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చిస్తారని సమాచారం. వీరి భేటీ నాలుగు నుంచి ఆరు గంటలు కొనసాగుతుందనీ, రక్షణ రంగంలో రష్యాపై అమెరికా ఆక్షల ప్రభావం.. ఇరు దేశాల మధ్య ఆయుధాల వ్యాపారంపై ఏ మేరకు ఉంటుందనే దానిపై చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment