Bricks Conference
-
భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం
బీజింగ్: రష్యాలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. బ్రెజిల్లో జరగబోయే జీ20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్న నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ షియాన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారన్నారు.ఈ సందర్భంగా చర్చించిన ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య చర్చలు, సహకారాన్ని మెరుగుపరచడానికి, పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికి భారతదేశంతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఇరు దేశాల నేతలు, అధికారుల మధ్య త్వరలో జరగబోయే సమావేశపు షెడ్యూల్‌పై తన దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని షియాన్ చెప్పారు.గత నెలలో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో సందర్భంగా జరిగిన సమావేశంలో తూర్పు లఢాక్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన స్టాండ్ ఆఫ్ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకోవడంపై మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలను సక్రమంగా పరిష్కరించుకోవడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని ఆయన అన్నారు. అదే సమయంలో చైనా, భారత్‌లు వ్యూహాత్మక అవగాహనను కొనసాగించాలని, ఇరు దేశాలు సామరస్యంగా జీవించడానికి, కలిసి అభివృద్ధి చెందడానికి కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ అన్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు -
మోదీ మిత్రుడికి 1.30 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత దేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం ప్రజలు ‘మిస్టర్ 56’ స్నేహితుడికి మరో 50 ఏళ్ల పాటు సుమారు లక్ష కోట్ల పన్నులు చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఎన్నికల్లో ఛాతీని 56 అంగుళాలకు పెంచి ఉత్సాహంగా మాట్లాడే మోదీ.. పాక్, చైనాలతో చర్చల సమయంలో ఆ ఉత్సాహం ఎందుకు చూపరని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో మోదీని రాహుల్ ‘మిస్టర్ 56’గా అభివర్ణించారు. ‘క్షమించండి.. రాఫెల్ కుంభకోణం విలువ రూ. 30 వేల కోట్లు అని గతంలో చెప్పానుగానీ ఆఫ్సెట్ కాంట్రాక్టులను కలుపుకొంటే ఆ విలువ రూ.1.3 లక్షల కోట్లు’ అని రాహుల్ ట్వీట్‌చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో మోదీ స్నేహితుడికి 20 బిలియన్ల డాలర్ల (సుమారు 1.30 లక్షల కోట్లు) లబ్ధి చేకూరిందని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో మోదీ, రక్షణ మంత్రి అబద్ధాలాడుతున్నారని ఆరోపణలు చేశారు. మోదీ.. డోక్లాం గురించి మరిచారా? ‘బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలసి పలు అంశాలు చర్చించినా డోక్లాంను ప్రస్తావించడం మరిచారు. ఈ ప్రభుత్వం దేశ సరిహద్దులు, జాతి భద్రత విషయంలో ఎప్పుడు ధైర్యం చేసి మాట్లాడుతుందో.. కళ్లెర్ర జేసి, ఛాతీ 56 అంగుళాలకు పెంచుతుందో.. 132 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
బంధం మరింత బలోపేతం
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను జరిపే చర్చలు ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విషయాన్ని ఆయన రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో ట్విట్టర్లో వెల్లడించారు. రష్యాలోని సోచి నగరంలో పుతిన్‌తో మోదీ సోమవారం అనధికారికంగా భేటీ అవనుండటం తెలిసిందే. ‘మైత్రీపూర్వక రష్యా ప్రజలకు వందనం. పుతిన్‌ను ఎప్పుడు కలుసుకున్నా నాకు అదొక సంతోషం’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, ఉగ్రవాదం, త్వరలో జరగనున్న ఎస్సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చిస్తారని సమాచారం. వీరి భేటీ నాలుగు నుంచి ఆరు గంటలు కొనసాగుతుందనీ, రక్షణ రంగంలో రష్యాపై అమెరికా ఆక్షల ప్రభావం.. ఇరు దేశాల మధ్య ఆయుధాల వ్యాపారంపై ఏ మేరకు ఉంటుందనే దానిపై చర్చించే అవకాశం ఉంది. -
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా..
* నేటి నుంచి ‘బ్రిక్స్’ సదస్సు.. బ్రెజిల్‌కు చేరుకున్న మోడీ * ప్రపంచస్థాయి సదస్సులో తొలిసారిగా పాల్గొననున్న ప్రధాని ఫోర్టాలెజా(బ్రెజిల్): ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భాగమైన ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం బ్రెజిల్‌లోని ఫోర్టాలెజా నగరానికి చేరుకున్నారు. ‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా’లతో కూడిన ఈ కూటమి ఆరో సమావేశాలు మంగళ, బుధవారాల్లో జరుగుతున్నాయి. ‘సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి’ ఎజెండాతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రత్యేక అభివృద్ధి బ్యాంకు, ఆగంతుక నిధి ఏర్పాటు, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై చర్చించనున్నారు. తొలుత ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడీ.. ఆదివారం రాత్రి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం బ్రెజిల్లో సదస్సు నిర్వహిస్తున్న ఫోర్టాలెజా పట్టణానికి చేరుకున్నారు. అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుపైనే.. ఈ సారి ‘బ్రిక్’ సమావేశాల్లో ముఖ్యంగా రూ. 6 లక్షల కోట్లతో ‘బ్రిక్స్’ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు, ఆగంతుక నిధి ఏర్పాటుపై చర్చలు జరుగనున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి సభ్య దేశాల్లో ఎవరెవరు ఎన్ని నిధులు ఇవ్వాలనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలా? ఐదు దేశాలూ సమానంగా కేటాయించాలా? అన్నదానిపై ఇంతకు ముందటి భేటీలో చర్చించినా నిర్ణయానికి రాలేదు. భారత్ మాత్రం అన్ని దేశాలూ సమానంగా నిధులను ఇవ్వాలంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తదితర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను చేపట్టాలనే డిమాండ్‌తోనూ ‘బ్రిక్స్’ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రపంచ స్థాయి నేతలతో తొలిసారిగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. నరేంద్ర మోడీకి ఎక్కువ మంది ప్రపంచస్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఈ సదస్సు ద్వారా లభిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ జుమా, బ్రెజిల్ అధినేత దిల్మా రోస్సెఫ్‌లతో మోడీ సమావేశం అవుతారు. అనంతరం బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో పలు లాటిన్ అమెరికా దేశాల అధినేతలతో భేటీ కానున్నారు.