కొలంబో: వచ్చేవారం శ్రీలంకలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఎల్‌టీటీఈకి ఒకప్పటి కంచుకోట, తమిళుల ప్రాబల్య ప్రాంతం అయిన జాఫ్నాను సందర్శించనున్నారు. జాఫ్నాను సందర్శించిన అనంతరం శ్రీలంక పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో జాఫ్నాను సందర్శించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తర్వాత జాఫ్నాను సందర్శించనున్న రెండో దేశాధినేత కూడా మోదీయే కానున్నారు. అదేవిధంగా శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించనున్న నాలుగో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. మార్చి 13న కొలంబోకు చేరుకోనున్న మోదీ బౌద్ధుల పవిత్రనగరం అనురాధాపురను కూడా సందర్శించనున్నారు.