
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లండన్‌లో కుటుంబ సమేతంగా టీ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో లీకయింది. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే లండన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతున్న దృష్యాన్ని చూసి షరీప్ అనారోగ్యం కారణం చూపి లండన్ వెళ్లారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి సలహాదారుడు షాహబాద్ గిల్ విమర్శించారు. ఆరోగ్యంగానే ఉన్నా విదేశాల్లో గడుపుతూ.. నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఆయన మాట్లాడుతూ.. షరీఫ్ ప్రజలను ముర్ఖులుగా భావిస్తున్నారని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన వెంటనే పాకిస్తాన్‌కు వచ్చి దర్యాప్తు సంస్థలకు సహరించాలని డిమాండ్ చేశారు. షరీఫ్ మద్దతుదారులు తమ నాయకుడి ఆరోగ్యం బాగుందంటూ సంతోషంగా ఉన్నారని.. మరి దర్యాప్తు సంస్థలకు సహకరించడానికి షరీప్ ఎందుకు సంకోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా షరీఫ్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. కొందరు షరీఫ్‌ను అవమానించాలనే ఆయన ఫోటోలను విడుదల చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
షరీప్ తీవ్ర గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారిని.. పాక్ ప్రభుత్వ వైద్యుల సూచన మేరకే లండన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాధి కారణంగా ఆయనకు జరగాల్సిన ఆపరేషన్ వాయిదా పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
చదవండి: నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment