‘న్యూరోలైఫ్’ తో న్యూ లైఫ్
న్యూయార్క్: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అద్భుతమైన ‘స్మార్ట్’ పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరికరం పేరు‘ న్యూరోలైఫ్’. వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైన వారిలో ఈ పరికరాన్ని ఉపయోగించి కదలికను తీసుకొచ్చారు. ఓహియో స్టేట్ వర్సిటీ వేక్స్‌నర్ మెడికల్ సెంటర్‌కు చెందిన న్యూరో శాస్త్రవేత్తలతో కలిసి బట్టేల్లే రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రయోగం చేసింది.
వెన్నుపూస దెబ్బతిని మంచానికే పరిమితమైన 24 ఏళ్ల యువకుడి మీద ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. అతని మెదడులో చిన్న కంప్యూటర్ చిప్‌ను ఉంచి ఎలక్ట్రానిక్ న్యూరల్ బైపాస్ ద్వారా మెదడు నుంచి సంకే తాలను కండరాలకు చేరి తద్వారా కదలికలను వీరు గమనించారు.