అభివాదం చేస్తున్ననికోలస్ మండ్యురో
కారకస్ : నికోలస్ మడురో రెండవ సారి కూడా వెనిజులా ప్రధానిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన వెనిజులా ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం 90 శాతం ఓట్లు పోల్ కాగా ఇందులో మడురోకు 68 శాతం, ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్‌కు 21శాతం ఓట్లు లభించాయి. ఆదివారం ఎన్నికల అధికారులు మడురోను విజేతగా ప్రకటించారు. కాగా మడురో ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గినట్లు ఫాల‍్కన్ ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలను మడురోకు అనుకూలంగా ఉండేలా కొద్ది నెలల ముందుగానే నిర్వహించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు చెల్లవని, వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 46శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారని ప్రతిపక్షం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment