నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి | Nina davuluri to transgressing student | Sakshi
Sakshi News home page

నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి

Published Sun, Apr 20 2014 3:19 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి - Sakshi

నీనా దావులూరితో హద్దుమీరిన విద్యార్థి

సస్పెండ్ చేసిన స్కూలు యాజమాన్యం

 న్యూయార్క్: తెలుగు సంతతికి చెందిన అమెరికా అమ్మాయి, మిస్ అమెరికా నీనా దావులూరితో హద్దుమీరి మాట్లాడిన విద్యార్థిని ఆ స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది. పెన్సిల్వేనియాలోని ఒక స్కూల్ సందర్శనకు వెళ్లినపుడు 18 ఏళ్ల ఆ ఆకతాయి పాట్రిక్ ఫర్వెస్ తనతో డేటింగ్ చేయాల్సిందిగా నీనాను కోరాడు. ఆ పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి ప్రశ్నావళి కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థి ఒక ప్లాస్టిక్ గులాబీ పువ్వుతో స్టేజిపైకి వచ్చి ఆ ప్రతిపాదన చేశాడు. ఇది విన్న వెంటనే 24 ఏళ్ల నీనా ఆశ్చర్యపోయి.. తర్వాత దరహాసం చేస్తూ ఉండిపోయింది.

ఈ ఆకతాయి చేష్టను ఆ పాఠశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఆ విద్యార్థిని మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. ఆ విద్యార్థి తమ మాటను లెక్కచేయకుండా ప్రవర్తించాడని యాజమాన్యం చెప్పింది. ఆ విద్యార్థి మాట్లాడుతూ.. కొంత మంది ఒత్తిడి చేయడం వల్లే తానీపని చేశానని చెప్పాడు. ఆ తర్వాత క్షమాపణ కోరుతూ అధికారులకు లేఖ రాశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement