వాషింగ్టన్ : ఉత్తర కొరియా విశృంఖలంగా అభివృద్ధి చేస్తున్న అణు క్షిపణులతో అమెరికన్ నగరాలకు పెనుముప్పు పొంచిఉందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాను ప్రమాదపుటంచుల్లో నెట్టిన గత పాలకులు చేసిన తప్పిదాలను తాను పునరావృతం చేయబోనని స్పష్టం చేశారు. కిమ్ జాంగ్ ఉన్ మాదిరి ఏ దేశం తమ సొంత ప్రజలను నిరంకుశంగా అణిచివేయదని అన్నారు. కొరియా విధ్వంస అణు కార్యక్రమం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించేందుకు తాము ఆ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.
అణ్వాయుధాలను ఉత్తర కొరియా సమీకరించుకోకుండా అడ్డుకునేలా ముందస్తు చర్యలు చేపడతానని అన్నారు. అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఉత్తరకొరియా ఆగడాలను ప్రస్తావిస్తూ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment