ఇక ఐసిస్ ప్రతీకారాన్ని చూడండి | Omar Mateen Called 911 to Pledge Allegiance to ISIS | Sakshi
Sakshi News home page

ఇక ఐసిస్ ప్రతీకారాన్ని చూడండి

Published Fri, Jun 17 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

ఇక ఐసిస్ ప్రతీకారాన్ని చూడండి

ఇక ఐసిస్ ప్రతీకారాన్ని చూడండి

కాల్పులకు ముందు ఫేస్‌బుక్‌లో మతీన్ పోస్టులు
* విచారణకు సహకరించాలని జుకర్‌బర్గ్‌కు సెనేట్ కమిటీ లేఖ

వాషింగ్టన్: ఆర్లెండో కాల్పులకు ముందు, కాల్పుల సమయంలో హంతకుడు ఒమర్ మతీన్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులపై  ఆసక్తి నెలకొంది. మతీన్ ఫేస్‌బుక్ వివరాల్ని ప్రస్తావిస్తూ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌కు అమెరికా అంతర్గత భద్రతపై ఏర్పాటైన సెనేట్ కమిటీ లేఖ రాసింది. కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని కమిటీ చైర్మన్ రాన్ జాన్సన్ ఫేస్‌బుక్‌ను కోరారు.

దాడులకు ముందు, దాడుల సమయంలో ఉగ్రవాద సమాచారంతో పాటు విద్వేష పూరిత పోస్టులు చేసేందుకు మతీన్ ఫేస్‌బుక్ ఉపయోగించినట్లు తెలిసిందన్నారు.  ఈ లేఖ వివరాలను  అమెరికా న్యూస్ చానల్ వెల్లడించింది. ‘ఐదు ఫేస్‌బుక్ ఖాతాలకు మతీన్‌తో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. జూన్ 12, 2016న ఫేస్‌బుక్‌లో ‘పల్స్ ఆర్లెండో’, ‘షూటింగ్’ పదాలతో మతీన్ వెదికాడు. ఐసిస్‌పై అమెరికా, రష్యాలు దాడులు ఆపాలని, ఐసిస్ చీఫ్ బగ్దాదీతో కలసి పనిచేసేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నానని, అల్లా నన్ను అంగీకరిస్తాడంటూ మతీన్ పోస్టు చేశాడు.

మరో పోస్టులో పాశ్చాత్య దేశాల చెడు పనుల్ని నిజమైన ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరని, అమాయక మహిళలు, పిల్లల్ని వైమానిక దాడులతో చంపుతున్నారని, ఇక ఇస్లామిక్ స్టేట్ ప్రతికారం రుచి చూడండంటూ పేర్కొన్నాడు.  చివరి పోస్టులో మతీన్ స్పష్టంగా... వచ్చే కొద్ది రోజుల్లో అమెరికాలో ఐసిస్ దాడుల్ని చూస్తారని రాశాడు. మే 2016లో ‘శాన్ బెర్నార్డినో’ ఉగ్రవాదుల సమాచారం కోసం మతీన్ అన్వేషించాడు. జూన్ 4, 2016న ఫేస్‌బుక్‌లో ‘బగ్దాదీ స్పీచ్’ కోసం వెదికాడు.’ అని  జాన్సన్ తెలిపాడు.
 
భార్య అరెస్టుకు సిద్ధం
ఈ ఆర్లెండో కాల్పుల కేసులో మతీన్ భార్య నూర్ సల్మాన్‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి. కాల్పుల ప్లాన్ ముందుగానే నూర్‌కు తెలుసని మీడియా తెలిపింది.  
 
తర్వాతి లక్ష్యం శాన్‌డియాగో
 ‘గే’ వైబ్‌సైట్ క్రైగ్స్‌లిస్ట్ లోని ప్రకటనొకటి కలకలం రేపింది.  ‘మరిన్ని ఆర్లెండో కాల్పుల్ని కోరుతున్నాం.  ఆర్లెండో ఘటన ఇప్పటికే ఆలస్యమైంది. మీ వర్గాన్ని నిర్మూలిస్తాం. కాలిఫోర్నియాలోని  శాన్‌డియాగోనే తర్వాతి లక్ష్యం’ అని అందులో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement