
ఇస్లామాబాద్ : మామూలుగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. చాలా కుక్కలు యాజమాని బైక్‌పైకి ఎక్కిన తర్వాత బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను, పరిసరాలను చూస్తుంటాయి. ఇది అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ! ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువకుడు ఆవును తన బైక్‌పై ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ఆ ఆవుకూడా అలవాటున్న దానిలా ఏ బెరకూలేకుండా ప్రయాణం చేసింది. ఈ వింతను అతని పక్కగా ప్రయాణిస్తున్న వారు వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెడీగా స్పందించారు. ‘‘ అసలైన కౌబాయ్ అంటే ఇతడే.. ఇలాంటివి కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే జరుగుతాయి.. పాకిస్తాన్‌కి మీకు స్వాగతం.. మీ పందుల్ని, కుక్కల్ని, ఆవుల్ని తీసుకురండి, అద్భుతమైన ప్రయాణం చేయండ’’ని కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment