
ప్లకార్డులతో నిరసనలు చేస్తున్న పౌరులు
న్యూయార్క్ : కరోనా వైరస్ ధాటికి అమెరికా మొత్తం అతలాకుతలం అవుతోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు.. ఊరినిండా శవాలు ఇది ప్రస్తుత అమెరికా పరిస్థితి. లాక్‌డౌన్‌తో గుడ్డిలో మెల్ల అన్న చందంలా పరిస్థితి కొద్దిగా పర్లేదు అనిపిస్తోంది. అయితే అసలు కరోనా అదుపులోకి వస్తుందా? దాన్ని ఎలా అదుపు చేయాలి? ప్రజల్ని ఎలా కాపాడాలి?.. అని ప్రభుత్వం, అధికారులు ఆలోచిస్తుంటే కొంతమంది ప్రజలు మాత్రం చావు కోసం చంకలు గుద్దుకుంటున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ నిరసనలు చేపట్టారు. ( కరోనా: ఉచిత సేవకు ఊహించని గౌరవం! )
అమెరికాలోని న్యూ హాంప్‌షేర్‌లో దాదాపు 400మంది పౌరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించడాన్ని వారు తప్పుబట్టారు. ‘ స్వేచ్ఛగా జీవించండి లేదా చావండి ’ అంటూ నినాదాలు చేశారు. టెక్సాస్ నగరంలోనూ 250 మంది పొడిగించిన లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 7 లక్షల 40 వేల కేసులు నమోదవ్వగా దాదాపు 40 వేల మంది మృత్యువాతపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే న్యూ హాంప్‌షేర్‌లో 1,287 కరోనా కేసులు నమోదు కాగా, 37 మంది మరణించారు. ( ప్లాన్ అదిరింది.. కుక్కపిల్ల చెడగొట్టింది! )
Comments
Please login to add a commentAdd a comment