‘మడత’ హోటల్! | pexotel hotel of duch company | Sakshi
Sakshi News home page

‘మడత’ హోటల్!

Published Sun, May 24 2015 12:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

‘మడత’ హోటల్!

‘మడత’ హోటల్!

హైదరాబాద్: మడత మంచాల మాదిరిగానే ఈ హోటల్‌ను కూడా మడతపెట్టి తీసుకెళ్లొచ్చు! ఊరికి దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన చోట విందులు, ఉత్సవాలు, సమావేశాలు ఉన్నాయనుకోండి. అక్కడ హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లు ఉండవు కదా. అందుకే అతిథులకు అప్పటికప్పుడే హోటల్ గదులను సిద్ధం చేసేందుకే ఈ ఏర్పాటన్నమాట. లగేజీని మడత పెట్టి తీసుకెళ్లినట్లు ఈ హోటల్‌ను కూడా జస్ట్ పది నిమిషాల్లోనే మడత పెట్టేయొచ్చు. ఎక్కడైనా పది నిమిషాల్లోనే గదిని సిద్ధం చేయొచ్చు.

అందుకే దీనికి ‘ఫ్లెక్సోటెల్’ అని పేరు పెట్టారు. ఇందులో రెండు మంచాలు, కుర్చీలు, బల్లలతో పాటు.. బాత్‌రూమ్ కూడా ఉంటుంది. ఔట్‌డోర్స్‌లో సాధారణంగా గుడారాలు వేస్తుంటారు. అయితే, అక్కడా హోటల్ దొరికితే బాగుండని అనుకునేవారికి, చౌకగానే హోటల్ గదులను అందించాలన్న ఆలోచనతో దీనిని ఓ డచ్ కంపెనీ తయారు చేసింది. దీనికి తాళం వేసుకోవచ్చు కాబట్టి పూర్తి ప్రైవసీ, సౌకర్యంగా ఉంటుంది. సరేగానీ.. మడతపెట్టినా తీసుకెళ్లడం ఇబ్బంది కాదా? ఏం కాదు.. ఎందుకంటే ఒక్క లారీలోనే ఏకంగా 20 హోటల్ గదులను ఈజీగా తీసుకెళ్లొచ్చట!

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement